తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు హిట్ కావడానికి.. అమెరికాలో హిట్ కావడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమా కూడా అక్కడ బోల్తా కొట్టే అవకాశాలు ఉంటాయి. అయితే కొందరు హీరోలకు మాత్రం మిగతావారితో పోలిస్తే యూఎస్ లో ఆదరణ ఎక్కువ. టాప్ హీరోలలో మహేష్ బాబుకు యూఎస్ లో భారీ ట్రాక్ రికార్డు ఉంది. మీడియం రేంజ్ హీరోలలో అయితే నానికి కూడా సూపర్ రికార్డ్ ఉంది. సినిమాకు మంచి టాక్ వస్తే వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరడం నాని సినిమాకు చాలా సులువు.
కానీ ఈమధ్య మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. నాని సినిమాలు అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిలిస్తున్నాయి. ఇదంతా 'కృష్ణార్జున యుద్ధం' తో మొదలైంది. ఇక 'దేవదాస్' కూడా అక్కడా నష్టాలు తప్పలేదు. 'జెర్సీ' సినిమాకు సూపర్ రేటింగ్స్.. క్రిటిక్స్ ప్రశంసలు లభించాయి. సాధారణగా ఇలా ప్రశంసలు లభించిన సినిమాకు యూఎస్ లో భారీ ఆదరణ దక్కుతుంది.. కానీ అనూహ్యంగా 'జెర్సీ' కూడా బ్రేక్ ఈవెన్ కు కాస్త దూరంలో ఆగిపోయింది.
తాజాగా 'గ్యాంగ్ లీడర్' పరిస్థితి కూడా అంతే. గ్యాంగ్ లీడర్ ఓపెనింగ్స్ బాగానే ఉన్నా తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయింది. దీంతో యూఎస్ డిస్ట్రిబ్యూటర్ కు నిరాశ తప్పలేదు. కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ నాని సినిమాలు అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు కలిగిస్తున్నాయనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పేమాట. నిజానికి ప్రతి హీరో సినిమా అక్కడ డిస్ట్రిబ్యూటర్ల జేబులకు చిల్లు పెడుతోంది..మరి నాని విషయమే ఎందుకు ప్రస్తావించుకోవడం అంటే.. గతంలో నాని సినిమా అంటే బ్రేక్ ఈవెన్ కు గ్యారెంటీ ఉండేది.. ఇప్పుడు అది కూడా లేదు. ఇక మిగతా హీరోల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది!