నాని టెస్టులో పాసయ్యాకే డైరెక్షన్ ఛాన్స్

Update: 2023-03-13 08:00 GMT
కొత్త డైరెక్టర్లు కొత్త కథలతో వస్తే వెంటనే హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తారు. వారిని నమ్మాలి అంటే... వాళ్ళ కథతో పాటు... అనుకున్నది అనుకున్నట్లు తీసే సత్తా కనిపించాలి. ఇక నేచురల్ స్టార్ నాని ఇద్దరు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చారు. అయితే వారిలో నాని ఏమ్ చూసి దర్శకులకు ఛాన్స్ ఇచ్చారో అని అనుకుంటున్నారు.

దీని గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నాని వారికి ఛాన్స్ ఇవ్వడానికి కారణం... నాని పెట్టిన టెస్ట్ లో ఆ డైరెక్టర్స్ పాస్ అవ్వడమేనట. నాని ప్రెసెంట్ నటిస్తున్న దసరా సినిమాను దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక నాని 30 వ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కిస్తున్నారు. అయితే వీరిద్దరికీ నాని ఛాన్స్ ఇవ్వడానికి ఒక కారణం తెలుస్తుంది.

నానికి మీరు కథ చెప్పే ముందు.. అని పెట్టిన టెస్ట్ లో పాస్ అయ్యారని తెలుస్తుంది. కథలో కొన్ని సీన్స్ ను నాని షూట్ చేసుకుని రమ్మన్నట్టు సమాచారం. ఆయనే ఆ దర్శకులకు కాస్త డబ్బులు ఇచ్చి... వాళ్ళు చెప్పిన సీన్స్ ను షూట్ చేసుకుని రమ్మన్నారట. అయితే  నాని పెట్టిన టెస్టులో ఈ దర్శకులు పాస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే వీరికి నాని చాన్స్ ఇచ్చారని సమాచారం.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక నాని 30 వ సినిమాను నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌ గా చేస్తోంది. చూడాలి ఇక నాని నమ్మకాన్ని ఈ దర్శకులు ఎంత మేరకు నిజం చేస్తారు అని.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News