నాని- నజ్రియా నజీమ్- ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `అంటే సుందరానికి`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 10న (ఈ శుక్రవారం) తెలుగు- తమిళం- మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇలాంటి లైట్ హార్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను థియేటర్ ప్రేక్షకులు ఆదరిస్తారని నాని భావిస్తున్నాడు. కరోనా వల్ల ఆలస్యమైనా ఇప్పుడు రిలీఫ్ గా వీక్షిస్తారని కూడా కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసాడు నాని.
``వెంట వెంటనే భారీ యాక్షన్ సినిమాలు (ఆర్.ఆర్.ఆర్- పుష్ప-కేజీఎఫ్ 2) చూసిన ప్రజలకు మహమ్మారి తర్వాత కొంత ఉపశమనం కావాలి. కేవలం తేలికగా శ్వాస తీసుకునేలా సినిమా అంతటా మీ పెదవులపై చిరునవ్వు నింపేలా ఇలాంటి గమ్మత్తయిన చిత్రం చాలా అవసరం. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటికి వెళతారు. మనమంతా ఇప్పుడు వెతుకుతున్న సినిమా ఇదని నా ఉద్దేశ్యం.
ఇది ఇప్పుడు బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను`` అని నాని అన్నారు. సినిమాలో నాని పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని ట్రైలర్ ఇప్పటికే రివీల్ చేసింది. తన జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్లాలనేది సుందర్ (నాని) అనే బ్రాహ్మణ యువకుడి కల. నజ్రియా అక లీలా ప్రముఖ ఫోటోగ్రాఫర్ కావాలనే లక్ష్యంతో ఉంటుంది. సుందర్ - లీల ఇద్దరివీ రెండు భిన్న ప్రపంచాలు. ఇంతలోనే వారి కలయిక ప్రేమకథ ఆసక్తికరం. ఈ జంట ప్రయాణంలో వినోదం ఉంటుంది. గతంలో వచ్చిన కొన్ని తెలుగు సినిమాల్లో కులాంతర వివాహాలపై బ్రాహ్మణ సంఘాలు నిరసనలు వ్యక్తం చేసిన కథలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ క్రైస్తవ యువతితో బ్రాహ్మణ యువకుడు ప్రేమలో పడ్డాక ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అన్నది చూపించారు. నాని తన సినిమా సమాజానికి చికాకు కలిగించదని చెబుతున్నారు.
ఎవరినీ కించపరుస్తూ మూవీలో అతిశయోక్తిగా ఏదీ చూపించలేదు. ఏ కులాన్నీ కూడా ఎగతాళి చేయలేదు. కామెడీ కోసం ఏదీ చేయలేదు. ఇది నిజానికి వాస్తవిక కథతో తెరకెక్కింది. మేం మతం గురించి చర్చించడం లేదు. మేము ఇక్కడ వ్యక్తుల గురించి చర్చిస్తున్నాము. కాబట్టి నేను వివాదాల గురించి అస్సలు చింతించను అని అన్నారు.