'రానా నాయుడు' పై నాని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Update: 2023-03-16 13:07 GMT
'దసరా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని బిజీగా ఉన్నారు. నార్త్‌ ఇండియాతో పాటు సౌత్‌ ఇండియాలో తెగ చక్కర్లు కొడుతూ సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఆ సందర్భంగా నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానా తో తనకు ఉన్న స్నేహం పై కూడా నాని కామెంట్స్ చేశాడు.

'రానా నాయుడు' సిరీస్ ను వెంకటేష్ మరియు రానా లు ప్రయోగాత్మకంగా చేశారు. ఇద్దరు కూడా విభిన్నమైన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర ఆయన అభిమానులకు సర్‌ ప్రైజ్ అనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ హీరోగా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చిన వెంకటేష్ నోటి నుండి మరీ ఇంతటి బూతులు ఏంట్రా బాబు అంటూ కొందరు విమర్శలు గుప్పించారు.

వెంకటేష్ పాత్ర తో పాటు రానా పాత్ర కూడా శృతిమించిన హింస మరియు రొమాన్స్ తో కూడినదంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయినా కూడా వెంకటేష్ ను వెబ్‌ సిరీస్ లో చూడాలనే ఉద్దేశ్యంతో రానా నాయుడును స్ట్రీమింగ్‌ చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో టాప్‌ 10 లో ఈ సిరీస్ నిలిచిందని నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సిరీస్ గురించి నాని మాట్లాడుతూ.. రానా ఎప్పుడు కూడా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతరులు చేసే దాన్ని మనం ఎందుకు చేయకూడదు అంటూ ప్రయత్నించే క్రమంలో రానా ఈ సిరీస్‌ ను చేశాడని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. 'రా' అంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రానా కు ఇది ఒక మంచి ప్రయోగం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రానా ముందు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయాలని తాను ఆశిస్తున్నాను. రానా ఇలాంటి ప్రయోగాలను చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడని నాని పేర్కొన్నాడు. వెబ్ సిరీస్ ల్లో నటించాలనే ఆలోచన వచ్చిన నేపథ్యంలో మొదట ఇలాంటి విమర్శలు తప్పవని.. కానీ భవిష్యత్తులో అంతా కూడా వెబ్ సిరీస్ ట్రెండ్‌ ను ఫాలో అయ్యే అవకాశాలున్నాయని నాని పేర్కొన్నాడు.          



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News