కృష్ణార్జునులు హ్యాట్రిక్ కొడతారా

Update: 2018-04-05 10:42 GMT
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కొత్త కళ వచ్చేసింది. గత శుక్రవారం వచ్చిన రంగస్థలం రికార్డులతో మోత మోగిస్తుంటే ఇవాళ విడుదలైన చల్ మోహనరంగా సైతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక అందరి కన్ను వచ్చే వారం విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం మీద ఉంది. కెరీర్ లో మూడో సారి ద్విపాత్రాభినయం చేస్తున్న నాని మొదట చేసిన రెండింటిలో జెండాపై కపిరాజు ఫ్లాప్ కాగా జెంటిల్ మెన్ హిట్ స్టాంప్ వేయించుకుని సేఫ్ అయ్యింది. కాని ఆ సినిమాల టైంకి ఇప్పటి నాని రేంజ్ కి చాలా వ్యత్యాసం ఉంది. మార్కెట్ పరంగా నాని కొత్త హైట్స్ కి చేరుకున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా అతని మీద డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. కాని కృష్ణార్జున యుద్ధం విషయంలో మాత్రం సాధారణంగా కనిపించే హడావిడి ఉండకపోవడం ఫాన్స్ ని టెన్షన్ పెడుతోంది.

ఈ మధ్య కాలంలో నాని సినిమా వస్తుంది అంటే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని కృష్ణార్జున యుద్ధం విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఆడియోతో పాటు ట్రైలర్ కూడా ఈ పాటికే విడుదలైనప్పటికీ ప్రమోషన్ పరంగా టీం వెనుకబడి ఉండటం చూస్తే అభిమానులకు ఖంగారు కలగడంలో ఆశ్చర్యం లేదు. పైగా నాని పాత్రలను పరిచయం చేయటం తప్ప ట్రైలర్ లో ఎగ్జైట్ అయ్యే విషయం ఏది చూపించలేదు. ఆడియో లో దారి చూడు అనే పాట తప్ప మిగిలినవి సోసోగానే ఉన్నాయని ఆడియో మార్కెట్ లో టాక్ ఉంది. ఎంత న్యాచురల్ స్టార్ అయినా హైప్ క్రియేట్ చేయకపోతే మొదటి రోజు కాకపోయినా రెండో రోజు వసూళ్ళ లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి.

సాధారణంగా తన సినిమా రిలీజ్ మరో రెండు వారాల్లో ఉందనగా నాని సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తాడు. కాని నాగార్జునతో మల్టీ స్టారర్ లో బిజీ అయిపోయిన నాని దాని గురించి అప్ డేట్ షేర్ చేసుకున్నాడు కాని దీని గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. మేర్లపాక గాంధీ ఇప్పటి దాక మీడియం రేంజ్ హీరోలతోనే డీల్ చేసాడు. సందీప్ కిషన్, ఎక్స్ ప్రెస్ రాజా చేసే టైం లో శర్వానంద్ నాని రేంజ్ ఉన్న స్టార్లు కాదు. సో మొదటి సారి అందులోనూ డ్యూయల్ రోల్ ఎలా డీల్ చేసాడా అనే అనుమానం ఇప్పటికే ఉంది. అందుకే రంగస్థలం-చల్ మోహనరంగా మొదలుపెట్టిన సక్సెస్ చైన్ ని కృష్ణార్జున అందుకుంటాడా లేదా అనే టెన్షన్ తీరాలంటే 12వ తేది దాకా ఆగాలి మరి.
Tags:    

Similar News