టాలీవుడ్ లో గత కొంత కాలంగా ఫెయిల్యూర్స్ చూడని హీరోల్లో ఒకే ఒక్కడు న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి కథ అయినా కూడా తన నటనే హైలెట్ అయ్యేలా చూసుకుంటూ ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటున్నాడు. నాని నటించిన సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అటు నిర్మాత ఇటు బయ్యర్లు చాలా సేఫ్ జోన్ లో ఉంటున్నారు.
ఇక అభిమానులు అయితే నాని సినిమాలో మినిమామ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు అందరు కృష్ణార్జున యుద్ధం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం మన ముందుకు రాబోతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ వర్క్ కూడా ఈ రోజే ఫినిష్ అయ్యింది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా రన్ టైమ్ 158 నిమిషాలు. సెన్సార్ సభ్యులయితే సినిమా చాలా బావుందని పాజిటివ్ వైబ్రెషన్స్ ఇచ్చారు.
నాని పర్ఫామెన్స్ పీక్స్ అంటూ.. డైరెక్టర్ మెర్లపాక గాంధీ మార్క్ కామెడీ మరోసారి క్లిక్ అవ్వడం పక్కా అని పాజిటివ్ కామెంట్స్ చేశారు. కృష్ణుడిగా అర్జునిడిగా నాని కనిపించిన తీరుకు 100 మార్క్స్ వేశారు. ఫైనల్ గా సినిమాను చూసిన కొంత మంది ప్రముఖులు కూడా అదే చెబుతున్నారు. చూస్తుంటే కృష్ణార్జున యుద్ధం థియేటర్స్ లో సందడి చేసేలా ఉందని అర్ధమవుతోంది. మరి రిలీజ్ తరువాత ఏ లెవెల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందో లెక్కేసుకోవాలి.