గాంధీ దారిలో కృష్ణార్జునులు

Update: 2018-04-06 09:17 GMT
న్యాచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణార్జునుల యుద్ధం' వచ్చే వారం విడుదల అవుతున్న నేపధ్యంలో దీని మీద అభిమానుల్లోనే కాక ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ బజ్ చాలానే ఉంది. నాని ఫుల్ ఫాంలో ఉండటంతో పాటు మూడో సారి డ్యూయల్ రోల్ చేయటంతో దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లో చెప్పి చెప్పకుండా కథను రివీల్ చేయకుండా తెలివిగా కట్ చేసిన తీరు ఇప్పటికే ఉత్సుకత రేపింది. నాని ఇమేజ్ సహజంగానే మార్కెట్ కు హెల్పవుతుంది కాని దర్శకుడు మేర్లపాక గాంధీ ట్రాక్ రికార్డు కూడా దీనికి బజ్ రావడానికి తోడ్పడుతోంది. ఇతని మొదటి రెండు సినిమాలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్-ఎక్స్ ప్రెస్ రాజా రెండూ ఘన విజయం సాధించినవి కావడం ప్లస్ ఎంటర్ టైన్మెంట్ గాంధీ బాగా డీల్ చేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగటం హైప్ ను పెంచుతోంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారానే హీరో సందీప్ కిషన్-హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమకంటూ ఒక మార్కెట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు. శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా విపరీతమైన దిగ్గజాల పోటీ మధ్య 2016 సంక్రాంతి బరిలో దిగి సూపర్ హిట్ కావడం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. స్టార్ ఎవరు అనేకంటే దాని కంటెంట్ లో ఎంటర్ టైన్మెంట్ ఎంత ఉంది అనే దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టే మేర్లపాక గాంధీ న్యాచురల్ స్టార్ తో డీల్ చేయటం ఎలా ఉండబోతోందో ఊహించుకుని అప్పుడే ఫాన్స్ అంచనాలు మొదలుపెట్టేసుకున్నారు.

అందుకే నాని-గాంధీ కాంబో కావడం వల్ల కృష్ణార్జున యుద్ధంకి మంచి హైప్ వస్తోంది. ట్రైలర్ లో చిత్తూరు యాసతో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడిగా విదేశాల్లో పేరు తెచ్చుకున్న పాప్ సింగర్ గా రెండు వైరుధ్యమైన పాత్రల్లో నానిని ఎలా ప్రెజెంట్ చేసుంటారా అనేది వచ్చే వారం తేలనుంది. అనుపమ పరమేశ్వరన్-రుక్సన్ మీర్ హీరొయిన్లు గా నటిస్తున్న ఈ మూవీకి ధృవ ఫేం హిప్ హాప్ తమిజా ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే ఆదరణ పొందింది.
Tags:    

Similar News