బంగారానికి బోనస్ గా వస్తున్న నాని

Update: 2016-08-11 17:07 GMT
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఊపు మీదున్నాడు. ఓ మూవీ విడుదల చేసే నాటికే మరో సినిమాని సగం పూర్తి చేసేయడం నాని స్పెషాలిటి. జెంటిల్మన్ తో హ్యాట్రిక్ కొట్టిన నాని.. మజ్ను అంటూ దసరాకి పలకరించబోతున్నాడు. ఇప్పుడు మజ్ను టీజర్ కి ముహూర్తం పెట్టామంటున్నాడు నాని.

'రేపు మధ్యాహ్నం 12.30కి మజ్ను టీజర్ ఆన్ లైన్ లో రిలీజ్ కానుంది. బాబు బంగారం తో కలిసి రేపు థియేటర్లలో మజ్ను హాయ్ చెప్పబోతున్నాడు' అని చెప్పాడు నాని. రేపు రిలీజ్ కానున్న బాబు బంగారం చిత్రంతో పాటు.. ప్యాకేజ్ లాగా ఈ టీజర్ కూడా ప్రదర్శించనున్నారన్న మాట. పైగా మధ్యాహ్నం 12.30 అనే ముహూర్తం కూడా అక్కడ పడే మాణింగ్ షోని బేస్ చేసుకుని పెట్టినదే. థియేటర్లలో మాణింగ్ ఇంటర్వెల్ కి టీజర్ ప్లే అయ్యే టైమ్ కి.. ఇక్కడ ఆన్ లైన్ లో టీజర్ ను వదులుతారన్న మాట.

ఇక ప్రేమ పాఠాలు వల్లిస్తున్న నాని 'స్టాప్ డ్రింకింగ్.. స్టార్ట్ లవింగ్' అంటూ కేప్షన్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. మజ్ను టైటిల్ కి సరిగ్గా సరిపోయే సబ్జెక్ట్ ఇది అని నేచురల్ స్టార్ అంటున్నాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాధ, జెంటిల్మన్ అంటూ వరుస హిట్స్ తర్వాత నాని చేస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను తెరకెక్కగా.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News