పారితోషకంపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2018-04-11 23:30 GMT
వరుసగా రెండు మూడు హిట్లు కొడితేనే హీరోల పారితోషకం అమాంతం పెరిగిపోతుంటుంది. అలాంటిది మూడేళ్లుగా ఫ్లాప్ అన్నదే లేకుండా ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు నాని. అతడి సినిమాలకు ఈజీగా 25-30 కోట్ల మధ్య బిజినెస్ జరుగుతోంది. డివైడ్ టాక్ తో కూడా నాని సినిమాలు ఇరగాడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి పారితోషకం ఏ రేంజిలో పెరిగి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇటీవల నాని పారితోషకంగా రూ.9 కోట్లకు పెరిగినట్లుగా వార్తలొచ్చాయి. అతడి కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ హిట్టయితే నాని రూ.10 కోట్ల రేంజికి కూడా చేరుకుంటాడన్న అంచనాలున్నాయి. ఈ విషయం నాని దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం చెప్పాడు.

తన రెమ్యూనరేషన్ పెరుగుదల అన్నది తన చేతుల్లో ఏమీ ఉండదని నాని అన్నాడు. ఒక సినిమాకు ఎంత బిజినెస్ అవుతోందన్నదాన్ని బట్టి పారితోషకం ఆధారపడి ఉంటుందని.. ఆ లెక్కల ప్రకారం మన ప్రమేయం లేకుండానే పారితోషకం పెరిగిపోతుందని.. రేప్పొద్దున ఒక సినిమా ఆడకపోతే తర్వాతి సినిమాకు ఆటోమేటిగ్గా రెమ్యూనరేషన్ తగ్గుతుందని నాని చెప్పాడు. ఒక సినిమాకు సరిగా బిజినెస్ సరిగా అవ్వలేదంటే తనే పారితోషకం తగ్గించుకుంటానని అన్నాడు. తనకు పారితోషకం అన్నది ప్రధానం కాదని.. తన పనితీరు ఎలా ఉంది.. తన నటనకు ఎలాంటి స్పందన వస్తోందన్నది ముఖ్యమని.. ‘నాని బాగా చేశాడు’ అని జనాలు అంటే అదే తనకు పెద్ద విషయమని నాని స్పష్టం చేశాడు. వరుస విజయాలు శాశ్వతం కాదనే క్లారిటీ తనకుందని అతనన్నాడు.
Tags:    

Similar News