సెకండరీ లీగ్‌ లో కొత్త సూప‌ర్‌ స్టార్‌

Update: 2015-09-29 17:30 GMT
టాలీవుడ్‌లో గ్రేడ్ 1 హీరోలు -  గ్రేడ్ 2 హీరోలుగా డివైడ్ చేస్తే ... 40 నుంచి 50 కోట్లు వ‌సూలు చేసే హీరోలంతా గ్రేడ్ 1 -  20 నుంచి 25 కోట్లు వ‌సూలు చేసే హీరోలంతా గ్రేడ్ 2. ఆ లెక్క‌న మ‌హేష్‌ - ప‌వ‌న్‌ - ప్ర‌భాస్‌ - రామ్‌ చ‌ర‌ణ్ - బ‌న్ని - ఎన్టీఆర్ వీళ్లంతా గ్రేడ్ 1 ప‌రిధిలోకి వ‌స్తారు. వీళ్లు న‌టించిన సినిమాల‌కు 40కోట్ల షేర్ వ‌సూళ్లు గ్యారెంటీ. ఆ త‌ర్వాత ర‌వితేజ‌ - రామ్‌ - నితిన్‌ - గోపిచంద్ లాంటి హీరోలు గ్రేడ్ 2లో చేర‌తారు. వీళ్లు న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద 16 నుంచి 22 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను ఈజీగా రాబ‌డ‌తాయి. ఇక మిగ‌తా హీరోల మార్కెట్ రేంజ్  15 కోట్లు లోపే. అయితే ఇప్పుడు గ్రేడ్ 2 రేంజి కంటే కాస్త పెద్ద రేంజ్‌ లోకి హీరో నాని వ‌చ్చి చేరాడు.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా న‌టించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్  దాదాపు 25కోట్లు వ‌సూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవ‌లం  ఓవ‌ర్సీస్ మార్కెట్ నుంచి 6.1 కోట్లు వ‌సూలు చేసింది. అంటే ఇప్పుడున్న హీరోల్లో ఒక్క‌సారిగా కింది నుంచి పైకి ఎదిగిన హీరోగా నాని పేరు చెప్పుకోవ‌చ్చు. నాని ఇప్పుడు 25 కోట్ల క్ల‌బ్‌ లో చేరిన సూప‌ర్‌ స్టార్. అత‌డిని న‌మ్మి ఆ రేంజులో బిజినెస్ ప్లాన్ చేయాల్సిందే ఇక‌. అయితే ఇక ముందు రామ్ హీరోగా న‌టించిన శివ‌మ్ రిలీజ్ కానుంది. ఒకవేళ శివమ్‌ సినిమా నానికి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం మనోడు ఇంకో నాలుగైదు కోట్లు ఈజీగా లాగేయొచ్చు.

ఈ మధ్య కాలంలో గ్రేడ్‌ 2 హీరోలకు.. పవర్‌ - పండగ చేస్కో - గుండె జారి గల్లంతయ్యిందే - లౌక్యం వంటి హిట్లు వచ్చాయి. ఈ హిట్లన్నీంటిలో కేవలం పవర్‌ ఒక్కటే ఫైనల్‌ రన్‌ లో 25 కోట్లు టచ్‌ చేసింది.. మిగిలినవి 22 కోట్ల లోపే. మరి కేవలం 25 రోజుల్లో నాని 25 టచ్‌ చేశాడంటే.. ఇక సెకండరీ లీగ్‌ లో నెం.1 గా ఎదిగిన కొత్త సూపర్‌ స్టార్‌ అనేగా చెప్పాలి.. సూపరబ్బా నాని!!!
Tags:    

Similar News