ఎప్పుడో ఈగ సినిమాతోనే 50 కోట్ల హీరో అయినా.. ఇప్పుడు పాతిక కోట్ల షేర్ సాధించడంతోనే సంబరపడుతున్నాడు నాని. దీనికి కారణం.. వరుస ఫ్లాపులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైసా - జెండాపై కపిరాజు లాంటి గుర్తు తెచ్చుకోలేని సినిమాలతో తనకు తనే దిగిపోయాడు ఈ న్యాచురల్ స్టార్.
నిజానికి కెరీర్ గ్రాఫ్ ఇలా పడిపోవడంలో తప్పు నానిదే అని చెప్పాలి. ఈగ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే.. ప్రాజెక్టుల ఎంపికలో తప్పులు చేశాడు. ముఖ్యంగా మాస్ అప్పీల్ ఉండే పాత్రల్లో కనిపించాడు. కానీ సహజమైన నటనతో ఆకట్టుకునే నాని ని.. రఫ్ పాత్రల్లో చూడలేకపోయారు. ఇతగాడిని ఎలా ప్రెజెంట్ చేయాలో.. కరెక్ట్ గా పసిగట్టాడు డైరెక్టర్ మారుతీ.
సాఫ్ట్ అండ్ క్యూట్.. ఇదీ భలేభలే మగాడివోయ్ మూవీలో నాని కేరక్టర్. స్టోరీ కూడా సింపుల్. హడావిడి - హైరానా ఏం ఉండవ్. అందుకే మళ్లీ అష్టాచెమ్మానాటి నాని గుర్తుకొచ్చాడు ఈ మగాడిని చూస్తే. ఎంజాయ్ చేయడమే కాదు.. తిరుగులేని తీర్పుని ఇస్తూ.. నానిని స్టార్ ని చేసి కూర్చోబెట్టారు ప్రేక్షకులు కూడా. ఇప్పటికైనా నాని తనకు సూటయ్యేలా, జనాలను మెప్పించేలా కేరక్టర్స్, కాన్సెప్ట్స్ ఎంచుకుంటే... స్టార్ స్టేటస్ లో మరో మెట్టు ఎక్కేస్తాడు ఈ బోర్న్ యాక్టర్.