హను రాఘవపూడి.. అందాల రాక్షసి లాంటి క్లాస్ మూవీతో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు. ఐతే తొలి సినిమాకు భిన్నంగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఐతే నానితో సినిమా అవకాశం మాత్రం అతడికి అంత సులువుగా ఏమీ దక్కలేదట. చాలా కథలు చెప్పి.. అతణ్ని ఒప్పించలేక చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో అతణ్ని మెప్పించాడట. ఈ సంగతి నానినే స్వయంగా వెల్లడించాడు. ‘‘హను నాకు చాలా కథలు చెబుతూ నా వెనుక తిరుగుతూనే ఉన్నాడు. తను చెప్పిన చాలా కథలకి నేను నో చెబుతూ వచ్చాను. చివరగా ఈ స్క్రిప్టుని ఓకే చేసాను. ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచీ నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాను. నా సైడ్ నుంచి చిన్న చిన్న సలహాలు కూడా ఇచ్చాను’’ అని నాని చెప్పాడు.
హను దర్శకత్వ ప్రతిభ గురించి చెబుతూ.. ‘‘హను సింప్లీ సూపర్బ్. ఈ సినిమా స్టొరీ లైన్ ఆలోచన నుంచి.. సినిమాలో ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి ఫ్రేం దాకా అతని క్రియేటివిటీనే అని చెప్పాలి. స్క్రిప్టే దశలో ఉండగా చాలా విషయాలు ఎలా చేస్తే బాగుండు అనేదాని మీద చర్చించుకున్నాం. కానీ ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్ళాక ఇక అంతా అతని వన్ మాన్ షోనే. అతను సినిమాలో చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. అతడి ఆరోగ్యం ఏమవుతుందో.. అతనేమైపోతాడో అని కొన్నిసార్లు కంగారు పడిపోయేవాళ్లం. షూటింగులో భాగంగా దెబ్బలు కూడా తగిలించుకునేవాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా పనిలో మునిగిపోయేవాడు. అతడి కమిట్ మెంట్ అద్భుతం. ఇలాంటి దర్శకుడు కచ్చితంగా సక్సెస్ అందుకుని తీరాలి’’ అని నాని అన్నాడు.