తెలుగు బిగ్ బాస్ సీజన్ సూపర్ హిట్ కొట్టింది. ఆ సిరీస్ విజయంలో హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్‌ది కూడా ముఖ్య పాత్రే. శని ఆది వారాలు వచ్చి పార్టిసిపెంట్స్‌ని ఉత్సాహపరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ టిఆర్పీని బాగానే పెంచాడు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 2 మొదలవ్వబోతోంది. ఆ కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్ నానీని ఎంపిక చేశారు నిర్వాహకులు. అందుకోసం నానీని బాగానే పారితోషకం అందిస్తున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 1కు గానూ ఎన్టీఆర్ దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నట్టు సమాచారం. మరిప్పుడు నానీకి ఎంతిస్తున్నారు? న్యాచురల్ స్టార్‌కు కూడా అతని సినిమా పారితోషకానికి ఏమాత్రం తీసుపోకుండానే ఆఫర్ చేశారట. సాధారణంగా నానీ సినిమాకు ఏడు కోట్ల రూపాయల నుంచి తొమ్మిది కోట్ల వరకు తీసుకుంటాడు. ఒక్క సినిమాకు 60 రోజులు ఇస్తాడు. బిగ్ బాస్ సీజన్ 2కు ముప్పై రోజుల డేట్స్ ఇచ్చాడు. అందుకే ఆయనకు మూడున్నర కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించారట బిగ్ బాస్ నిర్మాతలు. బిగ్ బాస్ షోకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కనుక నానీకి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్ అంతా తానై మొదటి సీజన్‌ను బాగానే రక్తి కట్టించాడు. మాటల మంత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు మరి నానీ ఏ మేరకు వేదికపై అలరిస్తాడో... జోకులు పేలుస్తాడో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ సెలెక్షన్ అయ్యింది కానీ పార్టిసిపెంట్‌ల ఎంపిక ఇంకా జరుగుతూనే ఉంది. ఈసారి ఎవరు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారో అని ప్రేక్షకులకు కాస్త ఉత్కంఠ కలుగుతోంది. మొదటి సీజన్‌ను శివబాలాజీ గెలుచుకున్నాడు.