సభకు నమస్కారం పెడుతున్న నాని
పెద్దలు.. నాయకులు సభలకు.. సమావేశాలకు అటెండయినప్పుడు తమ ప్రసంగంలో భాగంగా మొదట చెప్పే మాట ‘సభకు నమస్కారం’. ఇప్పుడు ఇదే టైటిల్ తో నాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేయబోతున్నాడు. టైటిల్ ను బట్టి ఇది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గా వస్తున్న సినిమా అనే విషయం అర్ధమైపోతుంది. నాని - దిల్ రాజు కాంబినేషన్ లో నేను లోకల్ తరవాత మరోసారి ఈ హిట్ కాంబినేషన్ లో సభకు నమస్కారం వస్తోంది.
రాబోయేదంతా ఎన్నికల సీజన్. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అందుకే పొలిటికల్ జోనల్ లో సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. టాప్ హీరో మహేష్ నటించిన భరత్ అనే నేను పూర్తిస్థాయి పొలిటికల్ మూవీనే. దీంతోపాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా నోటా అనే మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఓటు ప్రాధాన్యం చెబుతూ రాజకీయ చైతన్యం కలిగించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. నాని ఇంతవరకు పొలిటికల్ జోనర్ లో సినిమా చేయలేదు. అందుకే సభకు నమస్కారం ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
ప్రస్తుతం నాని హీరో నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. దీంతోపాటు బిగ్ బాస్-2 సీజన్ లో హోస్ట్ గానూ చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన వెంటనే స్పోర్ట్స్ డ్రామా జెర్సీ చేయబోతున్నాడు. మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దీని దర్శకుడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సభకు నమస్కారం షూటింగ్ స్టార్టవుతుంది.