నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచీ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తన సహజమైన నటనతో మెప్పిస్తున్నారు. గతేడాది 'టక్ జగదీశ్' - 'శ్యామ్ సింగరాయ్' వంటి రెండు సినిమాలను ప్రేక్షకులకు అందించిన నాని.. ఇప్పుడు మరో రెండు చిత్రాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
నాని హీరోగా నటించిన 'అంటే.. సుందరానికీ!' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మరోవైపు 'దసరా' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే నాని.. మరో రెండు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది.
'సోలో బ్రతుకే సో బెటర్' డైరెక్టర్ సుబ్బు ఇటీవల నాని ని కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించారట. దీనికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. అలానే విలక్షణ దర్శకుడు వీఐ ఆనంద్ కూడా రీసెంటుగా నేచురల్ స్టార్ ని మీట్ అయి ఓ కథ నెరేట్ చేసారట. అతను చెప్పిన సైన్స్ ఫిక్షన్ స్టోరీకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
కాకపోతే నాని ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు విడుదలైన తర్వాతే తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఏదేమైనా వరుస చిత్రాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండే నాని.. ఎప్పటిలాగానే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తన మార్కెట్ ను కూడా విస్తరించుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటికే 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని పాన్ సౌత్ ఇండియాగా రిలీజ్ చేసిన నాని.. ఇప్పుడు 'అంటే.. సుందరానికీ' సినిమాని తెలుగుతో పాటుగా తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. జూన్ 10న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని నటించిన సినిమా ''దసరా''. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇది నాని కెరీర్ లో రూపొందుతోన్న 29వ చిత్రం.. అలానే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది. 'దసరా' మూవీతో రాబోయే పాన్ ఇండియా క్రేజ్ ను బట్టి నాని నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.