ఎన్టీఆర్ స్వీట్ సిక్స్‌ టీన్

Update: 2016-03-03 04:19 GMT
ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా సరే.. మూణ్నాలుగు వారాలకు చాప చుట్టేసే రోజులివి. ఇలాంటి టైంలో ఒకటో రెండో సెంటర్లలో 50 రోజులాడినా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ఐతే సంక్రాంతి విన్నర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ దాదాపు వంద కేంద్రాల్లో అర్ధశతదినోత్సవానికి సిద్ధమవడం సెన్సేషనే అని చెప్పాలి. ఐతే సంక్రాంతికే విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’.. నాగ్ మూవీ స్థాయిలో కాకున్నా బాగానే ఆడింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16 సెంటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం విశేషం. నైజాం ఏరియాలో ఒక్క హైదరాబాద్‌  మాత్రమే మూడు సెంటర్లలో యాభై రోజులాడింది ‘నాన్నకు ప్రేమతో’. మిగతా కేంద్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ లోనివే.

వైజాగ్‌ లో రెండు సెంటర్లు.. కర్నూలులో రెండు సెంటర్లు.. కాకినాడ - విజయవాడ - చిలకలూరిపేట - తిరుపతి - చిత్తూరు - అనంతపురం - ఆదోని - ఎమ్మిగనూరుతో పాటుగా కర్ణాటకలోని బళ్లారిలో సైతం ‘నాన్నకు ప్రేమతో’ ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకుంది. ఒక జిల్లా వరకు ఎక్కువ సెంటర్లంటే.. కర్నూలు జిల్లానే కావడం విశేషం. ఆ జిల్లాలో నాలుగు సెంటర్లలో యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుందీ సినిమా. ఐతే ఇప్పటిదాకా ఆడటం గొప్ప విషయమే కానీ.. ఇకపై కంటిన్యూ కావడం కష్టమే. ఇప్పటికే కలెక్షన్లు బాగా డల్ అయిపోయాయి. 50 డేస్ మైల్ స్టోన్ పూర్తయింది కాబట్టి.. ఇక ‘నాన్నకు ప్రేమతో’ రన్ ఆగిపోవడం ఖాయం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయడం విశేషం.
Tags:    

Similar News