ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసినప్పటికీ ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో జనాలకు ఇంకా కొన్ని అనుమానాలున్నాయి. రిలీజ్ కు ఇంకో ఐదు రోజులే మిగిలి ఉన్నా.. ముందు రోజు విదేశాల్లో షోలు పడాల్సి ఉన్నా.. ఇంకా సెన్సార్ ప్రక్రియ ముగియకపోవడమే దీనికి కారణం. సుకుమార్ అండ్ టీమ్ రేయింబవళ్లు పని చేస్తూ ఫస్ట్ కాపీ రెడీ చేయడానికి శ్రమిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘నాన్నకు ప్రేమతో’ సెన్సార్ కాపీ రెడీ అయిపోయిందట. శనివారం సినిమాను సెన్సార్ కు పంపుతున్నట్లు సమాచారం. ఐతే సినిమాను సెన్సార్ పంపాక కూడా కొంచెం పని మిగిలి ఉంటుందట.
సెన్సార్ కు పంపే కాపీ నిడివి కొంచెం ఎక్కువ ఉంటుందని.. దాన్ని మరింత తగ్గించి క్రిస్ప్ గా తయారు చేసి సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఐతే సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 13న రిలీజ్ కావడం ఖాయం అంటున్నారు. సౌత్ ఆఫ్రికాతో పాటు కొన్ని ఫారిన్ లొకేషన్లకు 12వ తారీఖున ప్రీమియర్ షోలకు సంబంధించి బయ్యర్లు షెడ్యూళ్లు కూడా ఇచ్చయడమే దీనికి నిదర్శనం. కాబట్టి ఎన్ని కష్టాలు పడి అయినా సినిమాను 13న రిలీజ్ చేసి తీరేట్లే కనిపిస్తోంది ‘నాన్నకు ప్రేమతో’ టీమ్.