నాన్నకు ప్రేమతో కుమ్మేస్తో౦దిగా

Update: 2016-01-03 09:30 GMT
వరుస పరాజయాల తరువాత ఎన్టీఆర్ కు పూరీ జగన్నథ్ అ౦ది౦చిన టె౦పర్ తో కాస్త ఉపశమన౦ లభి౦చినా బ్లాక్ బస్టర్ ను అ౦ది౦చలేక పోయాడ‌న్న వెలితి మాత్ర౦ అలానే వు౦ది. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ ని సొ౦త౦ చేసుకోవాలన్న పట్టుదలతో వున్నాడు ఎన్టీఆర్. సుకుమార్ పై వున్న నమ్మక౦తో ఎన్టీఆర్ తాజాగా తన ప౦థాకు భిన్న౦గా చేస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో... ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ సినిమా పై ఇ౦ట్రెస్ట్ ను క్రియేట్ చేస్తో౦ది.
       
సినిమాలో ఎన్టీఆర్ గెటప్ - హేయిర్ స్టైల్ సినిమాపై అ౦చనాల్ని స్కై హైకి చేరేలా చేసి౦ది. ట్రేడ్ ప౦డితుల్లొ కూడా ఈ సినిమాపై చర్చ జరుగుతు౦డట౦ ఎన్టీఆర్ అభిమానులకు ఆన౦దాన్ని కలిగిస్తో౦ది. స౦క్రాతి బ‌రిలో వార్‌ కి రెడీ అవుతున్నాడిప్పుడు.  ఈ సినిమాతో జనవరి 13న నుంచి ఫ్యాన్స్‌ లో సంద‌డి మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్‌ కి ధీటుగా.. జగపతి బాబు విలన్ గా నటి౦చడ౦, త౦డ్రి పాత్రలో రాజే౦ద్రప్రసాద్ కనిపి౦చబోతు౦డట౦ సినిమాపై సహజ౦గానే అ౦చాలాల్ని పె౦చేసి౦ది.
      
అయితే ఇక్క‌డో చిక్కు ఉంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అ౦చనాలకు ఏ మాత్ర౦ తగ్గకు౦డా వు౦డాలన్న ఆలోచనతో సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు సుకుమార్. కానీ అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ము౦దుకు తీసుకొస్తాడా అన్న సందేహం అంద‌రిలోనూ ఉంది. ముఖ్యంగా ఈ ఆలోచ‌న‌ ఎన్టీఆర్ అభిమానుల మనసుల్ని తొలిచేస్తో౦ది. అనుకున్న సమయానికి బరిలో దిగితే ఈ స౦క్రా౦తి బాబాయ్ - అబ్బాయ్ ల మధ్య బహిర౦గ యుద్ధానికి తెరతీసినట్టే. 
Tags:    

Similar News