టాలీవుడ్ కి స్టైల్ నేర్పిస్తున్నారా ఏంటి?

Update: 2016-01-07 09:20 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ లు కలిసి నాన్నకు ప్రేమతో చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల్లో అన్నిటి కంటే ఎక్కువ ఖర్చు పెట్టినది, అన్నిటి కంటే ఎక్కువ అంచనాలున్న మూవీ ఇదే. అయితే.. ఇప్పటివరకూ ఈ మూవీకి సంబంధించి ఒక్కో గెటప్ ను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

ముందుగా ఎన్టీఆర్ అల్ట్రా మోడర్న్ అవతార్ ని చూపించారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ - ఆకట్టుకునే షేవ్ కట్ తో సూపర్బ్ గా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత విలన్ గా నటించిన జగపతిబాబు అవతారం కూడా విడుదల చేశారు. జగ్గూ భాయ్ సంగతైతే అసలు చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ కి టఫ్ ఫైట్ ఇచ్చే స్టైలిష్ విలన్ గా.. ఇంకెవరూ మ్యాచ్ చేయలేరనే రేంజ్ లో ఉన్నాడు. అయితే.. ఇన్నాళ్లూ జూనియర్ కి తండ్రిగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గెటప్ ని మాత్రం దాచిపెట్టారు. ఇప్పుడది కూడా రిలీజ్ అయింది. రాజేంద్రుడి గెటప్ చూస్తే.. హ్యాండ్సమ్ బిజినెస్ మ్యాన్ ఇలానే ఉంటాడనిపిస్తుంది.

ఈ ముగ్గురినీ వారి కొంగొత్త గెటప్ లతో సహా కలిపి.. సంక్రాంతి రిలీజ్ అంటూ ఓ పోస్టర్ వేశారు. అసలు ఈ స్టైలిష్ అవతారాలను చూస్తే.. వీళ్లు తీసింది, మనం చూడబోతోంది టాలీవుడ్ మూవీయేనా అనే డౌట్ వస్తోంది. ఈ గెటప్పులు చూస్తుంటే.. హాలీవుడ్‌ సినిమాలో జూనియర్‌ యాక్ట్‌ చేస్తే. . దాని డబ్బింగ్‌ మనం తెలుగులో చూస్తున్నట్లు ఉంటుందేమో అనిపిస్తోందంటున్నారు చాలామంది. స్టైల్ కా బాప్ అన్నట్లుగా తయారైన నాన్నకు ప్రేమతో.. రిలీజ్ అయ్యాక ఎన్ని వండర్స్ సృష్టించనుందో.
Tags:    

Similar News