నాన్నకు ప్రేమతో.. ఫస్ట్ డే రికార్డులు కేక

Update: 2016-01-16 06:25 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో.. అప్పుడే చెప్పలేకపోవచ్చు. కానీ మొదటి షేర్ రికార్డుల్లో మాత్రం ఇండస్ట్రీ టాప్ 4కి చేరిపోయింది. పొంగల్ సందర్భంగా వచ్చిన మొదటి సినిమా కావడంతో.. తొలిరోజున ఎక్కువ థియేటర్లే దక్కాయి. ఫస్ట్ కలెక్షన్స్ విషయంలో ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ గా నిలిచిందీ మూవీ.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు 12.18 కోట్ల షేర్ ను రాబట్టింది నాన్నకు ప్రేమతో. సీడెడ్ లో 30 సెంటర్లలో రిలీజ్ కాకపోయినా.. బాక్సాఫీస్ వసూళ్లను మాత్రం దంచికొట్టింది. ఏపీ తెలంగాణ వసూళ్లో బాహుబలి 22.4 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, శ్రీమంతుడు -14.72 కోట్లతో సెకండ్ ప్లేస్ లోను, బ్రూస్ లీ 12.66 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 12.18 కోట్లు వసూలు చేసిన నాన్నకు ప్రేమతో ఫోర్త్ ప్లేస్ లో నిలవగా.. 10.75 కోట్లతో అత్తారింటికి దారేది ఐదవ స్థానంలో ఉంది. నాన్నకు ప్రేమతో వసూళ్లలో నైజాం ఏరియా నుంచి 3.56 కోట్లు, సీడెడ్ నుంచి 2.45 కోట్లు, ఈస్ట్ 1.17 కోట్లు, వెస్ట్ 0.98 కోట్లు, గుంటూరు 1.52 కోట్లు, కృష్ణఆ 0.85 కోట్లు, నెల్లూరు 0.44 కోట్లు వచ్చాయి. ఇక కర్నాటకతోపాటు ఓవర్సీస్ లలోనూ తొలిరోజు ఎన్టీఆర్ రికార్డులన్నిటినీ నాన్నకు ప్రేమతో దాటేసింది.

ఇక వరల్డ్‌ వైడ్‌ కలెక్షన్లు చూస్తే.. తొలి రోజు నాన్నకు ప్రేమతో కర్ణాటకలో 1.82 కోట్లు.. యుఎస్‌ ఎ లో 2.59 కోట్లు.. ఇతర చోట్ల 60 లక్షలు వసూలు చేసి.. ఏకంగా 17.19 కోట్లు ''షేర్‌'' వసూలు చేసింది. బాహుబలి, శ్రీమంతుడు తరువాత ఇదే అతి పెద్ద ఓపెనింగ్‌. అంటే ఎన్టీఆర్‌ వరల్డవైడ్‌ 3వ స్థానంలో.. ఇండియాలో 4వ స్థానంలోనూ ఉన్నాడనమాట.
Tags:    

Similar News