నారా రోహిత్ కొత్త సినిమా ''అప్పట్లో ఒకడుండేవాడు'' టీజర్ ఎప్పుడైతే రిలీజైందో.. అప్పుడే ఈ సినిమాపై హైప్ పెరిగిపోయింది. ముఖ్యంగా సినిమాలోని పోలీస్ అండ్ నక్సలైట్ డ్రామా చూస్తుంటే మాత్రం ఒక పాత సినిమా గుర్తురాకమానదు. అప్పట్లో జనాల్ని హోరెత్తించి కాలక్రమంలో ఒక క్లాసిక్ తరహాలో మిగిలిపోయిన ఆ సినిమాను రోహిత్ అందరికీ గుర్తుచేస్తున్నాడు.
నక్సలైట్లకు సంబంధించిన కథలతో మన టాలీవుడ్ లో చాలా సినిమాలే వచ్చాయి. కాని అన్నింటికంటే కృష్ణవంశీ తీసిన ''సింధూరం'' సినిమా అద్భుతంగా ఉంటుంది. ఆ కంటెంట్లో ఉన్న పవర్ ను వంశీ మైండ్ బ్లోయింగ్ గా వాడాడు. అందుకే ఆ సినిమాను అందరూ క్లాసిక్ అంటుంటారు. ఇప్పుడు రోహిత్ హీరోగా దర్శకుడు సాగర్ చంద్ర తీసిన ''అప్పట్లో ఒకడుండేవాడు'' సినిమా కూడా సేమ్ సింధూరం తరహా అనుభూతులను తెప్పింస్తేదేమో అని టీజర్ చూసిన వారి ఫీలింగ్. అయితే సింధూరం సినిమాలో పోలీసుల క్యారక్టర్లు నెగెటివ్ లో ఉంటాయి కాని.. ఇక్కడ రోహిత్ క్యారెక్టర్ మాత్రం హీరోయిక్ గా అదిరిపోయింది. అంటే నక్సలిజంలోకి ప్రవేశించిన వారి నిజ జీవితపు అనుభవాలను నిజాయితీగా చూపిస్తూనే.. మరో ప్రక్కన పోలీసుల్లో ఉన్న హానెస్ట్ నేచర్ ను కూడా ఆవిష్కరించినట్లున్నారు. అందుకే ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో అనే ఎక్సయిట్మెంట్ పెరిగింది.
పైగా ఈ టీజర్ చూస్తే చాలా రోజుల తరువాత నారా రోహిత్ మళ్లీ తనకు ప్రియమైన రియలిస్టిక్ అండ్ డిఫరెంట్ కథను వెండితెరపైకి తెస్తున్నాడనే అనిపిస్తోంది. లెటజ్ సీ.. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో!!
Full View