కెరీర్ ఆరంభం నుంచి కంటెంట్ ఉన్న సినిమాలతో సాగిపోతున్నాడు నారా రోహిత్. అతడి కెరీర్ లో బాగా ఆడని సినిమా ‘ఒక్కడినే’లో కూడా పనికి రాని సినిమా ఏమీ కాదు. అందులోనూ మంచికంటెంటే ఉంటుంది. కానీ దాన్ని సరిగా డీల్ చేయలేదంతే. ఇక గత రెండేళ్లలో వచ్చిన ప్రతినిధి - రౌడీఫెలో - అసుర సినిమాలు రోహిత్ కు మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఈ శుక్రవారం ‘తుంటరి’తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు నారా వారబ్బాయి. ఇది మురుగదాస్ రాసిన కథతో తెరకెక్కిన సినిమాకు రీమేక్ కాబట్టి.. ఇందులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఐతే రీమేక్ మూవీ అయిన ‘తుంటరి’ కంటే కూడా రోహిత్ తర్వాతి సినిమా ‘సావిత్రి’ మీద చాలా ఆసక్తి ఉంది జనాల్లో. దీనికి కారణం లేడీ ఓరియెంటెడ్ టైటిల్ పెట్టడం.. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో టేస్టున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండటం.. టీజర్ - ట్రైలర్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటం.. ఇలా ‘సావిత్రి’ అనేక రకాలుగా ఆసక్తి రేపుతోంది. రోహిత్ అండ్ కో కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే మార్చి 25న నాగార్జున సినిమా ‘ఊపిరి’కి పోటీగా ‘సావిత్రి’ని రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది. నాగ్ ఇప్పుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పైగా ‘ఊపిరి’కి రెండు రోజుల ముందే సందీప్ కిషన్ ‘రన్’ కూడా రిలీజవుతోంది. అయినప్పటికీ ‘సావిత్రి’ టీమ్ మార్చి 25నే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే కంటెంట్ ఉండాలే కానీ.. పోటీతో సంబంధం లేకుండా సినిమాలు ఆడతాయని సంక్రాంతి టైంలో అర్థమైంది కాబట్టి.. కాన్ఫిడెంటుగా ముందుకెళ్లిపోతున్నట్లుంది సావిత్రి టీమ్.