నారా బాబు బావుంటాడు కానీ..

Update: 2015-10-07 09:30 GMT
తనీ ఒరువన్.. గత నెల రోజులుగా దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. తమిళనాట ఏ అంచనాల్లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిందీ సినిమా. సినిమా విడుదలైన వారానికే ఐదు భాషల నుంచి రీమేక్ కోసం ఆఫర్లు రావడం విశేషం. తెలుగులో రామ్ చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడని కూడా కన్ఫమ్ అయిపోయింది. ఐతే కాస్టింగ్ విషయంలోనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళ వెర్షన్ కు హైలైట్ గా నిలిచిన అరవింద్ స్వామి పాత్రను తెలుగులో ఎవరు పోషిస్తారన్నది ఆసక్తికరం.

ముందు రానా దగ్గుబాటి, నాగార్జునల పేర్లు వినిపించాయి. ఇప్పుడు నారా రోహిత్ అంటున్నారు. నిజంగా రోహిత్ ను తీసుకోవాలనుకుంటే అది సూపర్బ్ ఛాయిస్ అవుతుంది. మనోడు ఇప్పటికే విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. అరవింద్ స్వామిలాగే గంభీరంగా నటిస్తూ స్టైలిష్ గా విలన్ క్యారెక్టర్ని రక్తి కట్టించడానికి రోహిత్ బాగానే ట్రై చేస్తాడనడంలో సందేహం లేదు. హీరోగా ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రల కోసం తపించే రోహిత్.. ఈ విలన్ పాత్ర చేశాడంటే అతడి కెరీర్ మరో మెట్టు ఎక్కుతుందనడంలో సందేహం లేదు. కాకపోతే రోహిత్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే నాలుగైదు సినిమాలు ఓకే చేశాడు. విరామం లేకుండా షూటింగులో పాల్గొన్నా అవన్నీ పూర్తి చేయడానికి రెండేళ్లకు పైనే పడుతుంది. మరి ఇన్ని కమిట్మెంట్లుండగా.. ‘తనీ ఒరువన్’ రీమేక్ లో నటిస్తాడా అని సందేహం. చరణ్ తో సినిమా అంటే చాలా టైం పడుతుంది. క్యారెక్టర్ కూడా హీరోతో సమానంగా ఉంటుంది కాబట్టి చాలా డేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈ సినిమా పూర్తి చేసే టైంలో రోహిత్ హీరోగా కనీసం రెండు సినిమాలు పూర్తి చేయొచ్చు. మరి రోహిత్ ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News