ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో సినిమాలు ఏడాదికి మూడు విడుదలైనా ఆశ్చర్యమే. అలాంటిది నారా రోహిత్ ఈ ఏడాది ఏకంగా ఆరో సినిమా విడుదలకు రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే రోహిత్ నుంచి తుంటరి.. సావిత్రి.. రాజా చెయ్యి వేస్తే.. జ్యో అచ్యుతానంద.. శంకర సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఏడాది ఆఖర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో పలకరించబోతున్నాడు రోహిత్. ఈ ఏడాది తాను చేసిన అన్ని సినిమాల్లోకి ది బెస్ట్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అని రోహిత్ చెప్పడం విశేషం. ‘జ్యో అచ్యుతానంద’ లాంటి మంచి సినిమా ఉండగా.. ఈ చిత్రమే ‘ది బెస్ట్’ బెస్ట్ అన్నాడంటే దీనిపై అతడి కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
‘‘ఈ ఏడాది నాకిది ఆరో రిలీజ్. అన్నింట్లోకి ఇది నా బెస్ట్ వర్క్ అని చెబుతాను. నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం. శ్రీవిష్ణు.. సాగర్ చంద్ర కలిసి నా దగ్గరికి ఈ కథతో వచ్చారు. ఇలాంటి కథ నాకు చెప్పినందుకు వాళ్లకు థ్యాంక్స్. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో తొలిసారి నిర్మాతగా కూడా మారాను. కృష్ణవిజయ్.. ప్రశాంతి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. పీవీపీ గారిని సినిమా చూడమంటే ఆయనా చూసి అభినందించారు. మాకు అండగా నిలిచారు. ఈ సినిమాలో దర్శకుడు అనేక విషయాలు చర్చించాడు. నిజానికి ఈ కథను రెండు గంటల్లో చెప్పడం చాలా కష్టం. తీస్తే పెద్ద సీరియల్ లాగా చేయొచ్చు. అలాంటి పెద్ద కథను తక్కువ నిడివిలో అద్భుతంగా చెప్పాడు. నక్సలిజం.. క్రికెట్.. గ్లోబలైజేషన్.. ఇలా చాలా అంశాల గురించి ఇందులో చర్చించాడు సాగర్ చంద్ర’’ అని రోహిత్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/