సావిత్రి రిలీజ్ డేట్ ఫిక్స‌యింది

Update: 2016-03-16 13:02 GMT
వారం కింద‌టే తుంటరి సినిమాతో ప‌ల‌క‌రించాడు నారా రోహిత్‌. ఆ సినిమా మంచి ఫ‌లితాన్నే అందుకుంది. ఇప్ప‌టికే పెట్టుబ‌డి వెన‌క్కి తెచ్చేసి లాభాల దిశ‌గా సాగుతోంది. ఇంకో వారం పాటు తుంట‌రి సంద‌డి కొన‌సాగే అవ‌కాశ‌ముంది. ఐతే ఈ సినిమా జోరు ముగిసేలోపే మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేస్తున్నాడు రోహిత్‌. అత‌డి కొత్త సినిమా సావిత్రి ఏప్రిల్ 1నే విడుద‌ల కాబోతోంది. నిజానికి ఈ సినిమాను మార్చి 25నే రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఆ తేదీన ఊపిరి వ‌స్తుండ‌టం.. రెండ్రోజుల ముందు ర‌న్ మూవీ రేసులో ఉండ‌టంతో ఒక వారం ఆల‌స్యంగా సావిత్రిని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేమ్ ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నందిత టైటిల్ రోల్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సందర్భంగా నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ లుక్ - టీజర్ విడుదలైన రోజు నుంచి ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా మొత్తం మొత్తం పూర్తయింది. నారా రోహిత్ - నందితల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన పవన్ సాధినేని ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సాయికార్తీక్ అందించిన పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది.  అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Tags:    

Similar News