తమిళ్ లో బాహుబలికి ధీటుగా వసూళ్లు సాధించిన మూవీగా రికార్డులు సృష్టించిన విక్రం వేదాని రీమేక్ చేయాలనీ అప్పట్లోనే సురేష్ సంస్థ చాలా ట్రై చేసింది. మాధవన్ విజయ్ సేతుపతి పాత్రలను వెంకటేష్ రానాలతో వేయించి మల్టీ స్టారర్ గా గ్రాండ్ గా తీయాలనే ఆలోచన చేసింది. కాని ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. కొన్నాళ్ళ తర్వాత దానికి సంబంధించిన న్యూస్ ఆగిపోయాయి.
ఇప్పుడు కొత్త టాక్ ప్రకారం ఇది మళ్ళి లైట్ లోకి వచ్చిందట. కాకపోతే చిన్న మార్పుతో. రానా బదులు సీన్లోకి నారా రోహిత్ వచ్చి చేరినట్టు వినికిడి. ఒకవేళ అదే కనక నిజమైతే సక్సెస్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూ ప్రయోగాలు చేస్తూనే ఉన్న తనకు పెద్ద బ్రేక్ తో పాటు మంచి కం బ్యాక్ ఇచ్చినట్టు అవుతుంది. కాని ఇది నిజమని నిర్ధారణ కావాలి.
గతంలో తేజ దర్శకత్వంలో మొదలుపెట్టి ఆపేసిన ఆటా నాదే వేటా నాదేలో నారా రోహిత్ వెంకటేష్ లు తోడల్లుళ్ళుగా నటించారు. ఆదిలోనే హంసపాదులా అది అక్కడితో ఆగిపోయింది. ఆ కాంబో ఇలా మళ్ళి ఇంకో రూపంలో కార్యరూపం దాల్చడం విశేషమేగా.
పోలీస్ రౌడీలుగా ఇద్దరు హీరోల మధ్య వార్ ని తెరకెక్కించిన తీరు విక్రం వేదాని క్లాసిక్ గా మార్చింది. ఆ స్థాయి మేజిక్ ని రిపేట్ చేసే దర్శకుడు తెలుగులో ఎవరు దొరుకుతారో చూడాలి. ఇదంతా వినడానికి బాగానే ఉంది కాని నిర్మాత సురేష్ బాబు తానుగా చెప్తే తప్ప ఇది నిర్ధారణకు వచ్చినట్టు కాదు