నారా రోహిత్.. ఇంకోటి రెడీ చేస్తున్నాడు

Update: 2017-07-10 17:30 GMT
టాలీవుడ్లో శరవేగంగా సినిమాలు చేసే హీరోల్లో నారా రోహిత్ ఒకడు. ఒక దశలో అతడి చేతిలో పది దాకా సినిమాలుండటం విశేషం. గత ఏడాది అతడి సినిమాలు ఏకంగా ఆరు రిలీజయ్యాయి. అందులో జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు మంచి విజయం సాధించాయి. త్వరలోనే అతను శమంతకమణి.. కథలో రాజకుమారి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వీటి తర్వాత రోహిత్ ‘వీరభోగ వసంతరాయులు’ అనే సినిమా ఒకటి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘భీముడు’ అనే సినిమా కూడా కమిటయ్యాడు. ఇది కాకుండా నారా రోహిత్ సైలెంటుగా ఓ సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేస్తున్నాడు.

నవీన్ మల్లెల అనే కొత్త దర్శకుడితో నారా రోహిత్ ఓ వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. శరచ్చంద్రిక విజనరీ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ సరసన రెజీనా కసాండ్రా కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో రోహిత్ సరికొత్త అవతారంలో కనిపిస్తాడని సమాచారం. రోహిత్ స్లిమ్ లుక్ ను ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంటూనే కమర్షియల్ గానూ వర్కవుటయ్యేలా ఉంటుందట. నారా రోహిత్ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 25న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఆ రోజే దీని టైటిల్ కూడా ప్రకటిస్తారట. రోహిత్ కొత్త సినిమా ‘శమంతకమణి’ ఈ శుక్రవారం విడుదల కాబోతుండగా.. నెలాఖర్లో ‘కథలో రాజకుమారి’ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News