నారా రోహిత్‌ తగ్గట్లేదసలు!

Update: 2015-06-24 10:13 GMT
ఏడాది వ్యవధిలో నారా రోహిత్‌ సినిమాలు మూడు విడుదలయ్యాయి. ఆ మూడూ కూడా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన కొత్త సినిమా 'అసుర' విడుదలైన మరుసటి రోజే 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే సినిమా మొదలుపెట్టాడు రోహిత్‌. ఆ తర్వాత తమిళ హిట్‌ మూవీ 'మాన్‌ కరాటె' రీమేక్‌కు కొబ్బరికాయ కొట్టాడు. ఇంతలోనే ఇంకో కొత్త సినిమాకు ముహూర్తం చూసేసుకున్నాడు.

ఈ నెల 27న రోహిత్‌ ఇంకో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఆ సినిమా పేరు 'సావిత్రి'. కెరీర్లో తొలిసారి లేడీ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు రోహిత్‌. ఈ సినిమాకు టాలెంటెడ్‌ టెక్నీషియన్స్‌ను సెట్‌ చేసుకున్నాడు రోహిత్‌. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' లాంటి భిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్‌ సాధినేని తన రెండో ప్రయత్నంగా ఈ సినిమా చేయబోతున్నాడు.

'అలియాస్‌ జానకి' సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రవణ్‌ 'సావిత్రి'కి మ్యూజిక్‌ ఇవ్వబోతున్నాడు. కార్తికేయ సినిమాకు ఛాయాగ్రహణం అందించి.. ఆ తర్వాత 'సూర్య వెర్సస్‌ సూర్య'తో దర్శకుడిగా మారిన కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాతో మళ్లీ కెమెరా పడుతుండటం విశేషం. దర్శకుడిగా ప్రమోషన్‌ పొందినప్పటికీ.. కాన్సెప్ట్‌ నచ్చడంతో సినిమాటోగ్రఫీకి ఒప్పుకున్నాడు కార్తీక్‌. బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమా తన కెరీర్లో మరో విభిన్నమైన సినిమా అవుతుందని అంటున్నాడు రోహిత్‌.

Tags:    

Similar News