సినీ నేపథ్యం ఉన్న వాళ్లు రాజకీయాల వైపు చూడటం మామూలే. ఐతే ఈ మధ్య రాజకీయ వారసులు కొందరు సినిమాలపై దృష్టి పెడుతున్నారు. నారా రోహిత్.. విక్రమ్ గౌడ్.. గంటా రవితేజ ఈ కోవలోని వాళ్లే. ఐతే వీళ్లలో సినీ రంగంలో ఒక్క నారా రోహిత్ మాత్రమే సక్సెస్ అయ్యాడు. సినిమాల ఎంపికలో మంచి అభిరుచి చూపించి.. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు రోహిత్. ఈ శుక్రవారం రోహిత్ ‘కథలో రాజకుమారి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రాజకీయాల ప్రస్తావన రాగా.. ముక్కుసూటిగా తన అభిప్రాయాలు చెప్పాడు రోహిత్.
రాజకీయంగా చాలా కీలకంగా ఉన్న నారా కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్.. భవిష్యత్తులో తాను రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలే లేకపోలేదని చెప్పాడు. ప్రస్తుతానికి సినిమాలపైనే తన దృష్టి అని చెప్పిన రోహిత్.. అవసరమైనపుడు తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తానని చెప్పాడు. పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానన్నాడు. భవిష్యత్తులో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశాలున్నట్లుగా సూచనలిచ్చాడు రోహిత్. 2019 ఎన్నికల సందర్భంగా తాను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని కన్పమ్ చేశాడు రోహిత్. నారా వారబ్బాయి చిత్తూరు జిల్లాలో ఇంతకుముందు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.