అసుర హిట్ తో ఊపు మీదున్న నారా రోహిత్ వరుసగా అనేక ప్రాజెక్టులకు ఓకే చేసేశాడు. వాటిలో ఒకటి సావిత్రి - నందిత టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ హీరో. టైటిల్ చూసి ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అనిపిస్తున్నా.. హీరో కేరక్టర్ మీదే స్టోరీ ఆధారపడి ఉంటుందంటున్నారు. అయితే.. కథ కోసం అలా టైటిల్ సెట్ చేయాల్సి వచ్చిందట.
ఇప్పటివరకూ నారావారబ్బాయి లుక్ లో పెద్దగా ఛేంజ్ చూపించలేదు. బొద్దుగా ఉన్నాడనే విమర్శలొచ్చినా పెద్దగా లెక్క చేయలేదు. యాక్టింగ్ లో తన ఈజ్, స్టోరీల్లో విభిన్నమైన కాన్సెప్ట్స్ తోనే ఆకట్టుకున్నాడు. కానీ మొదటిసారి సావిత్రి కోసం శరీరాన్ని కూడా కష్టపెడుతున్నారు నారా రోహిత్. ఇందులో ఏకంగా సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడట. దీనికోసం ఇప్పటికే ఫిట్నెస్ ట్రైనర్ ని సెట్ చేసుకుని, వర్కవుట్స్ కూడా స్టార్ట్ చేసేశాడని తెలుస్తోంది. సావిత్రిలో తన కేరక్టర్ కోసమే ఇలా సిక్స్ ప్యాక్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
సావిత్రిలో ఇతగాడిది ప్లే బోయ్ కేరక్టర్. అమ్మాయిలను ట్రాప్ చేయడం, పడేయడం లాంటివి చేయాలంటే.. కాస్త లుక్ కూడా క్యాచీగా ఉండాలి కదా. అందుకే ఇలా సిక్స్ ప్యాక్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందన్న మాట. ఏమైనా వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినపుడు పట్టించుకోకుండా.. కేరక్టర్ డిమాండ్ చేయడంతో లావు తగ్గుతున్న నారా రోహిత్ ని అభినందించాల్సిందే.