మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. పాత అధ్యక్షుడు శివాజీ రాజా - కొత్త అధ్యక్షుడు సీనియర్ నరేష్ మధ్య గొడవల గురించి 800 మంది ఆర్టిస్టుల్లో చర్చ సాగింది. ఎలక్షన్ అయిపోయి.. కొత్త ప్యానెల్ వచ్చింది అనుకుంటే ఇంతలోనే ముప్పిరిగొలిపిన గొడవలు మరోసారి ఆర్టిస్టులు సహా ఇండస్ట్రీ యావత్తూ ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. కనీసం పాత కమిటీలో ఉపాధ్యక్షుడు - కార్యదర్శులు - ఇతర సభ్యులు అయినా అధ్యక్షుడైనా శివాజీ రాజా వెంట నిలబడ్డారు. అక్కడ ఒకే ఒక్క ప్రధాన కార్యదర్శి నరేష్ మాత్రమే విభేధించారు. కానీ తాజాగా ఎన్నికైన కొత్త కమిటీలో ఒకరితో ఒకరికి సరిపడడం లేదని తాజా గొడవలు చెబుతున్నాయి. వాళ్లలో వాళ్లే మీద పడి అరుచుకుంటూ కొట్లాటకు దిగడం చూస్తుంటే ముక్కున వేలేసుకుంటున్నారు.
సాక్షాత్తూ ప్రమాణ స్వీకారం రోజునే సీనియర్ నరేష్ పై అతడి టీమ్ కీలక సభ్యులు అయిన జీవిత - రాజేశేఖర్ ఇద్దరూ వ్యతిరేకంగా గళం ఎత్తారు. నేను అన్న భ్రమల్లోంచి బయటకు వచ్చి `మన` అనే వాస్తవంలోకి రాకపోతే కొత్త అధ్యక్షుడు నరేష్‌కి తామే శత్రువులం అన్నంతగా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఆర్టిస్టుల సంఘంలోనే కాదు ఇండస్ట్రీ పెద్దల్లో - ఇతర 24 శాఖల ముఖ్యుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తనతో పాటే టీమ్ సభ్యులకు సమాన గౌరవం ఇవ్వకుండా నరేష్ అంతా తానే అన్న తీరుగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారని - తమను అస్సలు సంప్రదించడం లేదని ప్రమాణ స్వీకార ఉత్సవంలోనే విరుచుకుపడడం చిల్లర గొడవలా అనిపించింది. ఇక ఈ గొడవలో గొడవ అన్నట్టుగా సీనియర్ నటి హేమ చేతిలోంచి నరేష్ మౌత్ లాక్కోవడంతో దానిని అవమానంగా భావించిన హేమ నరేష్ పై తీవ్రమైన ఫిర్యాదు చేశారు. తిరిగి అతడి నుంచి మైక్ లాక్కుని .. నరేష్ ప్రతిదానిని చేతిలోకి లాక్కుంటున్నాడని, ఇతర సభ్యుల్ని కలుపుకుని పోవడం లేదని విమర్శించారు.
ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే మళ్లీ గొడవలపై ఆర్టిస్టుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. శివాజీ రాజాకు, నరేష్ కు వ్యక్తిగతంగా సరిపడదు.. దానిని `మా`కు అన్వయించి రచ్చ చేశారు. అందువల్ల 800 మంది ఆర్టిస్టుల పరువు గంగలో కలిసిపోయింది. దీంతోపాటు టాలీవుడ్ లో చిల్లర గొడవలు అంటూ ఇతర మీడియాలు చులకన చేసేశాయి. కళామతల్లి ఒడిలో ఎంతో కీలకమైన `మా`కు ఇలాంటి అవమానాలు అవసరమా? పాత గొడవలు ముగిశాయి అనుకుంటున్న వేళ.. ఇప్పుడూ అదే దారిలో వెళుతున్న కొత్త అధ్యక్షుడిపై అంతా గరంగరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం రోజే ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడి తిరుగుబాటు చేశారంటే అసలేం జరుగుతోంది? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. వీళ్లేనా `మా` పరువు కాపాడేది? వీళ్లేనా మా సొంత బిల్డింగ్ కట్టేది? వీళ్లేనా నిధి సేకరణ కార్యక్రమాలు చేసేది? ఇలా అయితే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారంతా.