11లక్షల విరాళం అందించిన సీనియర్ హీరో..

Update: 2020-04-06 16:30 GMT
కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడం తో సినిమా ఇండస్ట్రీలకు భారీ నష్టం మిగిలింది. సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీలో సినిమాల కోసం పనిచేసే దినసరి కూలీల జీవనం కష్టం అయిపోయింది. ఈ మధ్య కరోనా వైరస్ మూలంగా ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోతే సినీ కూలీలు పస్తులు ఉంటున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించి భారీ విరాళాలు అందించడానికి కదిలి వస్తున్నారు. ఈ విరాళాల ద్వారా అయినా సినీ వర్కర్లకు కనీస సదుపాయాలు సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో సీనియర్ నటుడు నరేష్ 'మా' లోని 100 మంది సభ్యులకు 10,000 చొప్పున 10 లక్షల రూపాయిలను సాయంగా అందించడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే 58 మంది సభ్యుల బ్యాంకు ఖాతాలకు డబ్బులను జమ చేశారట. మిగిలిన సభ్యులకు కూడా ఇస్తున్నట్లు సమాచారం. అలాగే క‌రోనా క్రైసిస్ చారిటీకి మరో లక్ష రూపాయిలను విరాళంగా ప్రకటించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. దయచేసి ప్రభుత్వం విధించిన రూల్స్ పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Tags:    

Similar News