తన కెరీర్ లో అల్లరి సినిమాతో మొదటి హిట్ అందుకొని సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. కెరీర్ ప్రారంభమైన కొంతకాలంలోనే తన హావభావాలతో, కామెడీ టైమింగ్ తో మంచిపేరును సంపాదించుకున్నాడు. మంచి కామెడీ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పెద్ద హీరోగా ఎదిగాడు అయితే ఎన్ని సినిమాలు చేసినా ఆయనను హీరో చేసింది మాత్రం తండ్రి ఈవీవీ సత్యనారాయణ. తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ ఈవివి గురంచి తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన రూపొందించిన సినిమాలు అలాంటివి. రొమాంటిక్ అండ్ హెల్తీ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు ఈవీవీ. సందేశాలను కూడా తన మార్క్ కామెడీతో అందించగలడు. అందుకే ఈవీవీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
అయితే నరేష్ హీరోగా మారడానికి ఒక గొప్ప వ్యక్తి మాట ఆదర్శంగా నిలించిందట. ఆ విషయం తాజాగా వెల్లడైంది. గతంలో ఈవీవీ రూపొందించిన 'చాలా బాగుంది' సినిమా వంద రోజుల ఫంక్షన్‌కి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా వచ్చారట. అదే టైంలో అమితాబ్‌తో 'సూర్యవంశ్' సినిమా తీస్తున్నాడు ఈవీవీ. అయితే చాలా బాగుంది సినిమాకు నరేష్ క్యాషియర్‌గా పనిచేశాడు. ఆ ఫంక్షన్ లో క్యాషియర్ గా నరేష్ షీల్డ్ తీసుకుంటుండగా.. ఈవీవీ గారబ్బాయి నరేష్ అని బిగ్ బీకి పరిచయం చేశారట. వెంటనే అమితాబ్ స్పందించి.. 'మా అబ్బాయిలా పొడుగ్గా ఉన్నాడు. హీరోగా పనికొస్తాడు' అంటూ ఈవీవీతో అన్నారట. అంతే బిగ్ బీ చెప్పడంతో నరేష్ పట్టుబట్టి తండ్రిని ఒప్పించాడట. అనంతరం నటనలో శిక్షణ తీసుకుని హీరోగా మారి.. ఇలా అల్లరి నరేష్‌గా మనందరినీ నవ్విస్తున్నాడు.