తెలుగు ప్రేక్షకులు బాగా అడాప్ట్ చేసుకున్న అతి కొద్దిమంది పరభాషా నటుల్లో నాజర్ ఒకరు. తన అద్భుతమైన నటనతో ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోశారాయన. అందుకే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయారు. ఆయన కూడా అంతే.. తెలుగును పరాయి భాషగా భావించకుండా పూర్తిగా నేర్చేసుకుని తన డబ్బింగ్ తానే చెప్పుకుంటున్నారట కూడా. మరి.. అలాంటి నాజర్ ఒకప్పుడు ఇండస్ట్రీలో పూర్తిగా దివాలా తీసేసి ఉన్నదంతా పోగొట్టుకున్న సంగతి ఎంతమందికి తెలుసు.. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ నటననే నమ్ముకుని లేచి నిలదొక్కుకుని ఇప్పుడీ స్థాయిలో ఉన్నారట ఆయన ఈ సంగతులున్నీ ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాల్లోకి రాకముందు హోటల్లో వెయిటర్‌గా పని చేయడం.. నటుడిగా మంచి స్థాయిలో ఉండగా నిర్మాణంలోకి వెళ్లి డబ్బులన్నీ పోగొట్టుకోవడం... మళ్లీ నటుడిగా అవకాశాలు వెతుక్కుని పోయిందంతా సంపాదించుకోవడం గురించి ఈ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
నాజర్ తండ్రి ఒక స్టేజి ఆర్టిస్టు. నాజర్ బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారట.. కానీ, ఆయన తండ్రి మాత్రం నాజర్ ను నటుడిగా చూడాలనుకున్నారు. దీంతో నాన్న కోరిక మేరకు నాజర్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి తర్వాత తాజ్ హోటల్లో వెయిటర్‌గా చేరారు. అందులో పని చేసినంత కాలం సినిమాల విషయం మరిచిపోయారట. అప్పట్లోనే నాకు నెలకు 300 రూపాయలు జీతంతో పాటు టిప్పులు కూడా వచ్చేవట.. ఐతే తండ్రి బలవంతం చేయడంతో మళ్లీ ఆ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారట నాజర్. దానికితోడు అడయార్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో మెలకువలు నేర్చుకున్నారట. ఆ ఇన్‌స్టిట్యూట్లో నాజర్ నటుడిగా గోల్డ్ మెడల్ సాధించారు.
అయితే... ఆ గోల్డు మెడలేమీ సినిమా ఛాన్సులు రావడానికి కొంచెం కూడా సాయం చేయలేకపోయిందట. అది ఎవరికి చూపించినా గుడ్ అంటూ ప్రశంసించడమే కానీ చాన్సిచ్చేవారు మాత్రం లేరట. దీంతో ఆయన రూటు మార్చి డబ్బింగ్ ఆర్టిస్టు అయ్యారు. కానీ.. ‘నాయకుడు’ సినిమాతో నాజర్ కెరీర్ మలుపు తిరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐతే అడయార్ ఇనిస్టిట్యూట్ లో ఉన్నప్పుడు యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ కూడా నేర్చుకోవడంతో ఆ సరదాతో సొంతంగా సినిమా మొదలుపెట్టారాయన. అదే.. అవతారం సినిమా.. అలా మొత్తంగా నాలుగు సినిమాలు నిర్మించారు.. అన్నీ డిజాస్టర్లే. మొత్తం రూ.2.5 కోట్లు పోగొట్టుకుని రోడ్డున పడ్డారట. దాంతో మళ్లీ నటనపై ఫోకస్ చేసి అవకాశాలు అందుకోవడంతో ఆ నష్టం నుంచి బయటపడడమే కాకుండా స్థిరపడగలిగారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/