వావ్.. పైరసీలో ప్రత్యేకంగా జాతీయ గీతం

Update: 2016-12-23 03:30 GMT
మన దేశంలో థియేటర్లకు వచ్చి సినిమాలు చూసి ఎంతమంది ఉంటారో.. టోరెంట్స్ లో ఉచితంగా పైరసీ ప్రింట్స్ చూసి ఆనందించేవాళ్లు ఎంతమంది ఉంటారో లెక్క కడితే.. బహుశా ఈ పైరసీ బాపతే ఎక్కువగా ఉండొచ్చని ఓ అంచనా. ఇదిలా ఉంటే మన జాతీయ గీతం సినిమాల్లో తప్పనిసరిగా ప్లే చేయాలంటూ ఈ మధ్యనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ సంగతి తెలుసుకదా! ఇప్పటికే థియేటర్లలో ఇది అమలవడం.. జాతీయగీతాన్ని గౌరవించని కొందరిని అరెస్ట్ చేయడం జరిగిపోతోంది కూడా.

పైరసీకి.. జాతీయగీతానికి లింక్ ఎక్కడ కుదిరిందనే డౌట్ రావడం సహజమే. మలయాళంలో ఊఝం అనే మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. 15 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ మూవీని.. బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మంచి హిట్ సాధించినట్లే లెక్క. ఇప్పుడీ మూవీ టోరెంట్స్ లో దొరికేస్తుందనే విషయం పెద్ద సీక్రెట్ ఏమీ కాదు. టోరెంట్ సైట్లపై నిషేధం ఉన్నా.. దొంగోడికి దొడ్డిదారులు చాలా ఉంటాయి లెండి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఊఝం టోరెంట్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకున్న వాళ్లకు.. అందులో మన జాతీయగీతం జనగణమనను కూడా ఎంపీ3 ఫార్మాట్ లో పెట్టేశారు. అంటే మీరు పైరసీ సినిమా చూసినా.. ముందు జాతీయగీతం వినాలన్న మాట. ఇష్టం వచ్చిన ఫైల్ ప్లే చేసుకునే ఆప్షన్ ఉంటుంది కానీ.. పైరసీలో కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తున్న వాళ్లను ఏమనాలో అర్ధం కాని పరిస్థితి. పైరసీ చేయడం.. టోరెంట్స్ లో పెట్టడమే నేరం అయితే.. అందులో కూడా కోర్టు ఆదేశాలను పాటిస్తున్న వాళ్లకి ఎలాంటి బిరుదులు ఇవ్వాలో మరి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News