నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ.. మహర్షి చిత్రాలు రెండేసి జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ ఎడిటింగ్.. ఉత్తమ తెలుగు చిత్రం 2019 విభాగంలో అవార్డుల్ని సొంతం చేసుకోగా నాని ఆ ఆనందాన్ని తన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పంచుకున్నారు. మహర్షి చిత్రం ఉత్తమ పాపులర్ వినోదాత్మక చిత్రంగా.. బెస్ట్ కొరియోగ్రఫీ (రాజు సుందరం) విభాగంలో అవార్డులు అందుకోవడంపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన డాక్యు చిత్రం `వైల్డ్ కర్నాటక` జాతీయ పురస్కారం గెలుచుకోగా ఆయన తన చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం 67 వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించగా..`ఉత్తమ అన్వేషణ చిత్రం` కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకుంది. డాక్యుమెంటరీ చిత్రం తెలుగు వెర్షన్ కి కథకుడిగా ప్రకాష్ రాజ్ వాయిస్ ని అందించారు. దాదాపు 5కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం డిస్కవరీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పురస్కారం అందుకున్న ఆనందంలో ప్రకాష్ రాజ్ వైల్డ్ కర్నాటక టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
`వైల్డ్ కర్నాటక` డాక్యుమెంటరీకి ప్రాణం పోసిన తీరు అసమానం. నేను ఇందులో భాగం కావడం నిజంగా ఒక అందమైన అనుభవం. నాలుగు సంవత్సరాల కృషి. దాదాపు 500 గంటల ఫుటేజ్ తో వైల్డ్ లైఫ్ పై చిత్రమిది`` అని ప్రకాష్ రాజ్ అన్నారు. నేను ప్రకృతి ప్రేమికుడిని. అందుకే నన్ను లీనమయ్యేలా చేసింది. ఈ ప్రాజెక్టులో భాగం కావడం నాకు గర్వకారణం. తెలుగు వెర్షన్ కి నా వాయిస్ సరిపోతుందని విశ్వసించినందుకు డిస్కవరీ బృందానికి కృతజ్ఞతలు. 67 వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఈ అద్భుత విజయాన్ని సాధించిన నిర్మాతలు.. అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాతలు అమోఘవర్ష జెఎస్ -కళ్యాణ్ వర్మలను నేను అభినందిస్తున్నాను`` అని ప్రకాష్ రాజ్ అన్నారు.
సతీష్ కౌశిక్ చిత్రం `చోరియన్ చోరోన్ సే కామ్ హోతి` ఉత్తమ హరియాణా చిత్రం గా జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం నటుడు కౌశిక్ కోవిడ్ కి చికిత్సను తీసుకుంటున్నారు. అవార్డ్ గురించి తెలిసాక ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. హర్యాణా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నాను. అందువల్ల నేను ఈ చిత్రానికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యాను. ఇందులో నాతో పాటు నటించిన బృందానికి దర్శకుడు బబ్బర్ కి ధన్యవాదాలు అన్నారు.