కావాలిసినంత డబ్బుంది .. ఆ డబ్బుతో పేరును కొనలేం. పేరు రావాలంటే ఏదో ఒక కళాత్మక ప్రయత్నం చేయాలి. తమ ప్రతిభ నలుగురికీ తెలియాలంటే, నాలుగు కెమెరాల ముందు నిలబడి తళ తళ మెరవాలి .. నాలుగు టీవీ ఛానల్స్ లో కనిపించాలి. అప్పుడే నలుగురిలో గుర్తింపు వస్తుంది. క్రేజ్ వచ్చిన తరువాత ప్రతి కదలిక ప్రత్యేకమే అవుతుంది .. అప్పుడు అదో థ్రిల్. అందువలన ప్యాషన్ తో కాకుండా తెరపై తమ పేరు చూసుకోవాలి .. తమని తాము చూసుకోవాలి .. తమ గురించి నలుగురూ చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది సినిమా వైపు అడుగులు వేస్తుంటారు.
సంధ్య రాజు 'నాట్యం' అనే సినిమా కోసం రంగంలోకి దిగినప్పుడు .. ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్లు వచ్చినప్పుడు చాలామంది ఇలాగే అనుకున్నారు. డబ్బుంది .. ఎంతోకొంత టాలెంట్ ఉంది .. అది జనానికి తెలియడం కోసం ఆమె ఆరాటపడుతోంది .. కాలక్షేపం కోసం ఏదో ప్రయత్నం చేస్తుందని అనుకున్నవాళ్ల సంఖ్యనే ఎక్కువ. కానీ సంధ్యరాజు ఈ సినిమా విషయంలో వేసిన ప్రతి అడుగును గమనిస్తే, ఆమె ఈ సినిమాను ఒక తపస్సులా భావించిందనే విషయం అర్థమవుతుంది. పోస్టర్ల దగ్గర నుంచి ఆమె తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది.
ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ చూడగానే .. ఆ పోస్టర్లో ఆమె నృత్య భంగిమలు చూడగానే ఆమె గొప్ప కళాకారిణి అనే విషయం అర్థమైపోతుంది. అలాగే ప్రతి టీజర్ ను .. ట్రైలర్ ను .. సాంగ్స్ ను ఆమె స్టార్ హీరోలతో రిలీజ్ చేయిస్తూ, ఈ సినిమా సాధ్యమైనంత ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ఆమె డాన్స్ .. ఆ డాన్స్ ద్వారానే కొంత కథను చెప్పే ప్రయత్నం చేసిన తీరు అందరిలో ఈ సినిమా పట్ల ఆసక్తి పెరిగేలా చేసింది. ఇదేదో చిన్న సినిమానే అనుకున్నవారు, ఆ విజువల్స్ చూసి షాక్ అయ్యారు.
అందమైన .. ఆహ్లాదకరమైన ఆ విజువల్స్ చూపులను కట్టిపడేలా చేస్తున్నాయి. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ క్వాలిటీ విషయంలో పోటీ పడితే ఎలా ఉంటుందనడానికి నిదర్శనంగా ఈ సినిమా కనిపిస్తోంది. ఇక కాస్ట్యూమ్స్ విషయంలోను ఈ సినిమా ఆశ్చర్య చకితులను చేస్తోంది. సంధ్య రాజుకి ఇది తొలి సినిమా. అయినా ఆమె హావభావ విన్యాసం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఆమె కొరియోగ్రఫీ .. కాస్ట్యూమ్స్ .. నిర్మాణపరమైన విషయాలు దగ్గరుండి చూసుకున్నారు. సంధ్య రాజు కేవలం ఒక్క నాట్యం గురించి మాత్రమే చెప్పాలనుకుంటే ఆమె ప్రదర్శనలే ఇచ్చుకునేవారు.
కానీ 'నాట్యం' చుట్టూ ఎమోషన్ తో కూడిన ఒక బలమైన కథ ఉంది. తన ఊరు .. తనకి ప్రాణమైన నాట్యం .. తనకి ఇష్టమైనవాడు .. వీటి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన సంఘటనలు .. సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన సంధ్య రాజు .. ఇది సమష్టి కృషి అంటూ వేదికపై ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వడం ఆమె గొప్పతనానికి నిదర్శనం. ఈ సినిమాను ఒక కాలక్షేపం కోసం కాకుండా, అంకితభావంతో చేశారనే విషయం అర్థమవుతుంది. ఈ నెల 22వ తేదీన విడుదలతున్న ఈ సినిమా, 'ఆనందభైరవి' .. 'స్వర్ణకమలం' వంటి నాట్య ప్రధానమైన చిత్రాల సరసన నిలుస్తుందేమో చూడాలి.
Full View