కొన్ని వారాల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తన మనవరాళ్లకు ఒక ఓపెన్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. బోలెడంత గుర్తుంపు ఉన్న వంశం నుంచి వచ్చిన వారు కావడంతో.. అనేక ఆంక్షలు.. అడ్డంకులు.. పరిమితులు ఉంటాయని.. వాటన్నిటినీ కాదని జీవించే అలవాటు చేసుకోవాలని హితవు పలికారు బిగ్ బీ. జనాలు ఏమంటారో.. ఏమనుకుంటారో అని కాకుండా.. స్వతహాగా అనిపించినది చేయాలని.. తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని చెప్పారు అమితాబ్.
నిజానికి అమితాబ్ లేఖ తన వారసులకే అన్నట్లుగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అందరు అమ్మాయిలకు వర్తిస్తుంది. అయితే.. ఆ లెటర్ కు గ్రాండ్ డాటర్ నుంచి ఎలాటి రియాక్షన్ వచ్చిందో ఇప్పుడు చెప్పారు బిగ్ బీ. ప్రస్తుతం పింక్ ప్రమోషన్స్ లో ఉన్న ఆయన.. తన ఓపెన్ లెటర్ కు కూతురు కూతురైన నవ్య నవేలి నందా ఇచ్చిన ఆన్సర్ ఏంటో వివరించారు. 'తాతయ్యా.. నేను మీ మాటలనే ఫాలో అవుతా' అని చెప్పిందట అమితాబ్ మనవరాలు.
నవ్య రియాక్షన్ చూసి ఆమె తల్లి శ్వేత కూడా సంతోషించిందన్నారు బిగ్ బీ. 'నాన్నా నేను చాలా ఏళ్లుగా తనకు ఇదే చెప్పాలని అనుకుంటున్నా.. ఎలా చెప్పాలో తెలీలేదు. ఒక్క లెటర్ తో మీరు మొత్తం చెప్పారు. నా మనసులో ఉన్న బాధ తీర్చారు' అని చెప్పిందట అమితాబ్ కూతురు శ్వేత. తండ్రీ-కూతురు.. తాత-మనవరాలు ఎఫెక్షన్ అదిరింది కదూ.