ప్రేమికుల రోజు ముందే న‌య‌న్ - విఘ్నేష్ రొమాంటిక్ మూడ్!

Update: 2021-02-05 08:10 GMT
నయనతార - విఘ్నేష్ శివన్ జంట ప్రేమాయ‌ణం గురించి నిరంత‌రం అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. ఈ జంట త్వ‌ర‌లోనే పెళ్లికి రెడీ అవుతున్నార‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. కానీ దేనిపైనా ఆ జంట స్పందించదు. `నానుమ్ రౌడీ ధాన్ `సెట్స్ లో ఒకరినొకరు క‌లుసుకుని అనంత‌రం ప్రేమ‌లో ప‌డ్డారు. ఐదారేళ్లుగా ఆద‌ర్శ జీవ‌నం సాగించ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది.

ఈ జంట ప్రేమకథ ప్రత్యేకమైనది లేదా అసాధారణమైనది కాదు కాని ఇటీవ‌ల ఈ ప్రేమ‌జంట ఇత‌ర ప్రేమికుల‌కు గోల్స్ సెట్ చేస్తూ ఆద‌ర్శ జీవ‌నం సాగించ‌డం చ‌ర్చ‌ల్లోకొస్తోంది. ఒక‌రినొక‌రు గౌరవించుకోవ‌డం.. క‌లిసి ప‌ని చేయ‌డం.. త్యాగాలు.. ఇలా ప్రతి కోణంలో ఈ జంట ఆద‌ర్శంగా నిలుస్తోంది. పెళ్లిళ్లు స్వ‌ర్గంలో జ‌రుగుతాయంటారు! అందుకు ఈ జంట మ్యాచింగ్ ఒక పెద్ద ప్రూఫ్ అన్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ రొమాంటిక్ ఫోటోలు వీడియోలు మ‌రోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఇద్ద‌రూ ఎంతో రొమాంటిక్ గా ఉన్న త్రోబ్యాక్ ఫోటోలు జంట గోల్స్ ని ఫిక్స్ చేశాయంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. వాలెంటైన్స్ డేకి చాలా ముందు.. ప్రేమలో ఉండటం కంటే అందమైన‌ది ఏదీ లేదని నిరూపించే టాప్ 5 రొమాంటిక్ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ఇక వృత్తి ప‌రంగా బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇంకా పెళ్లి మాటెత్త‌డం లేద‌ని ఇంత‌కుముందు విఘ్నేష్ ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. క‌నీసం లాక్ డౌన్ లో అయినా ఆ మాటెత్త‌లేదు. అంటే ఇంకా అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌నే దీన‌ర్థం.

నయనతార - విఘ్నేష్ శివన్ ప్రేమికులు మాత్రమే కాదు.. వృత్తిపరమైన వ్య‌వహారాల్ని కూడా పంచుకుంటారు. విఘ్నేష్ `రౌడీ పిక్చర్స్` బ్యానర్ ‌కు న‌య‌న్ అండ‌గా నిలుస్తోంది. సమంత అక్కినేని- విజయ్ సేతుపతితో కలిసి విఘ్నేష్ శివన్ తెర‌కెక్కిస్తున్న `కాతు వాకులా రేండు కదల్`లో కూడా నయ‌న్ కనిపించనుంది.
Tags:    

Similar News