వివాదాస్పద పాత్రకు నయన్‌ షాకింగ్‌ పారితోషికం

Update: 2020-11-13 09:50 GMT
సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్స్‌ రూ. 2 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు అంటే అది చాలా పెద్ద విషయం. బాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ పదుల కోట్ల పారితోషికాలు తీసుకుంటున్నా సౌత్‌ హీరోయిన్స్‌ పారితోషికం మాత్రం మొన్నటి వరకు కోటికి అటు ఇటుగానే ఊగిసలాడుతూ వచ్చింది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అనూహ్యంగా పారితోషికాలు పెరుగుతూ వచ్చాయి. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న వారి పారితోషికాలు మీడియం రేంజ్‌ హీరోల స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా అనుష్క.. నయనతార వంటి స్టార్‌ లేడీస్‌ అంతకు మించి అన్నట్లుగా తీసుకుంటున్నారు.

నయనతార తాజాగా తమిళంలో నటించిన 'మూకుత్తి అమ్మన్‌' సినిమాకు గాను ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకుందట. ఈ పారితోషికం సౌత్‌ హీరోయిన్‌ లతో అత్యధికం. అధికం మాత్రమే కాకుండా ఇతర హీరోయిన్స్‌ తీసుకుంటున్న దానికి  డబుల్‌. హీరోల సరసన నటించే హీరోయిన్స్‌ కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు పారితోషికంను తీసుకుంటున్నారు. కాని నయన్‌ మాత్రం లేడీ ఓరియంటెడ్‌ సినిమా అవ్వడంతో నాలుగు కోట్లను దక్కించుకుంది.

తెలుగులో ఈ సినిమాను అమ్మోరు తల్లి పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మోరు పాత్రలో నయన్‌ నటించడంను కూడా కొందరు తప్పుబడుతున్నారు. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం తెలిసి కూడా నయన్‌ ఈ సినిమాకు ఓప్పుకుంది. కనుక ఆమె ఘట్స్‌ కు నాలుగు కోట్లు ఇవ్వడంలో తప్పులేదు అనిపిస్తుంది.
Tags:    

Similar News