నయనతార ఆశలన్నీ చిరు మీదే

Update: 2019-06-20 17:30 GMT
హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉండే సినిమా పరిశ్రమలో దశాబ్దం పైగా టాప్ ర్యాంక్ లో వెలగడం చిన్న విషయం కాదు. నయనతార ఈ విషయంలో తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. చిన్న పెద్ద తేడా ప్రతి ఒక్క హీరో తననే కావాలని డిమాండ్ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన నయన్ కు ఈ సంవత్సరం బొత్తిగా కలిసి రాలేదు.

సంక్రాంతికి చేసిన విశ్వాసం అజిత్ ఇమేజ్ పుణ్యమా అని కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం దాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తర్వాత హారర్ జానర్ లో డిఫరెంట్ గా డ్యూయల్ రోల్ లో చేసిన ఐరా మరీ దారుణంగా రెండు భాషల్లోనూ టపా కట్టేసింది. ఆఖరికి అమెజాన్ ప్రైమ్ లో సైతం దాన్ని లైట్ తీసుకున్నారు

తరువాత శివ కార్తికేయన్ తో చేసిన మిస్టర్ లోకల్ సైతం డిజాస్టర్ గానే నిలిచింది. దెబ్బకు తెలుగులో డబ్బింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న నాలుగో సినిమా కొలైయుతీర్ కాలం కోర్టు చిక్కుల్లో పడి ఆగిపోయింది. దీని హిందీ వెర్షన్ ఖామోష్ లో తమన్నా చేస్తే మూడు రోజులకె బాక్స్ ఆఫీస్ వద్ద ప్యాక్ అప్ అయిపోయింది.

సో రిలీజైన నయన్ కు సైతం అదే రిజల్ట్ దక్కవచ్చు. ఇక నెక్స్ట్ రాబోయే సినిమా చిరుతో మొదటిసారి చేసిన సైరానే. ఇది పెద్ద బ్రేక్ అవుతుందని చాలా నమ్మకంతో ఉంది నయన్. ఎలాగూ తమిళ్ కన్నడ వెర్షన్లు కూడా రిలీజవుతాయి కాబట్టి మళ్ళి పుంజుకోవచ్చు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా నయన్ కు ఆఫర్స్ వస్తున్నప్పటికీ సక్సెస్ లో ఉంటె వచ్చే కిక్కే వేరు. అందుకే సైరా మీద అన్ని ఆశలు

    

Tags:    

Similar News