లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఇన్నాళ్లు ఆమె పెళ్లి గురించిన వార్తలు మీడియాలో కొన్ని వందల్లో వచ్చాయి. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకుందంటూ కూడా ప్రచారం జరిగింది. విఘ్నేష్ శివన్ మరియు నయనతారల జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇద్దరికి పెళ్లి అయ్యిందేమో అంటూ ప్రచారం జరిగింది. కాని వీరి పెళ్లికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల పెళ్లి కి ఆంద్రప్రదేశ్ కు సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటీ అంటే నయనతార మరియు విఘ్నేష్ శివన్ ఎంతో ఇష్టంగా కొలిచే వెంకటేశ్వర స్వామి వారి సన్నిదిలో పెళ్లి చేసుకోవాలని భావించారట. తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. జూన్ 9వ తారీకున వీరి పెళ్లిని తిరుమల దేవస్థానం లో జరగబోతుందట.
ఎంతో మంది సెలబ్రెటీలు తిరుమల శ్రీవారి సన్నిదిలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల పెళ్లి తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో జరగడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రేమ గురించి దాదాపు అయిదు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు పెళ్లికి సిద్దం అయ్యారు.
వీరిద్దరు పెళ్లి చేసుకోకుండానే సహ జీవనం సాగిస్తున్నారు. ఇక వరుసగా ఆయన దర్శకత్వంలో ఆమె సినిమాలు చేయడంతో పాటు ఆమె మరియు ఆయన కలిసి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి పలు సినిమాలను నిర్మించారు. మంచి సక్సెస్ లను దక్కించుకుని కమర్షియల్ గా మంచి దూకుడు మీద ఉన్నారు. ఇటీవల విడుదల అయిన కాతువాకుల రెండు కాదల్ సినిమా తో వీరు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తిరుమల లో జరగబోతున్న పెళ్లి విషయమై సందడి నెలకొంది. ఇప్పటి వరకు అధికారికంగా ఒక స్పష్టత అయితే రాలేదు కాని సెలబ్రెటీల కు అందిన ఆహ్వానం మొదలుకుని రిసెప్షన్ వరకు రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. నయనతార పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పెళ్లి వార్తలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంగా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలను కంటిన్యూ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.