చెన్నై ఇంట.. దర్శకుడితో జంటగా హీరోయిన్

Update: 2016-11-30 07:30 GMT
సౌత్ బ్యూటీ నయన తార.. దర్శకుడు విఘ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది అన్నది పాత విషయమే. వీరిద్దరి ప్రేమ ముదిరి పాకాన పడిందన్నది ఒక న్యూస్ అయితే.. ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నారనే టాక్ కూడా ఉంది. కొన్నేళ్ల పాటు ఈ విషయాన్ని బైటకు చెప్పకుండా ఉండాలనే అగ్రిమెంట్ కూడా ఉందిట. పెళ్లి సంగతి అలా ఉంటే.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి కాపురం పెట్టేశారని తెలుస్తోంది.

చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో రీసెంట్ గా నయనతార ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. కోట్లలోనే రేట్ పలికే ఆ ఫ్లాట్ లోకి రీసెంట్ గా మారిపోయింది ఈ మలయాళీ కుట్టి. అయితే.. ఈ కొత్తింటిలో నయన్ ఒక్కతే ఉండడం లేదని.. విఘ్నేష్ శివన్ తో కలిసి జంటగా నివసిస్తోందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది మే నెలలోనే పెళ్లి చేసేసుకున్న ఈ జంట.. ఇప్పుడు కాపురం పెట్టేశారన్నది ఈ రూమర్స్ సారాంశం.

నానుం రౌడీదాన్ మూవీ సమయంలో పుట్టిన ప్రేమ.. ఇప్పుడు కాపురం వరకూ వచ్చేసిందన్నది కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట. నయన్ తో తన రిలేషన్ బాగా పర్సనల్ తప్ప.. బయటకు చెప్పేది కాదని విఘ్నేష్ శివన్ చెప్పినప్పటి నుంచి ఈ వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా నడుస్తోందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News