సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన నయనతార కెరీర్ ఆరంభం నుండి కూడా ఒక విమర్శను ఎదుర్కొంటూ వస్తుంది. అదేంటి అంటే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈమె పాల్గొనదు. అప్పుడప్పుడు అవార్డు వేడుకల్లో పాల్గొనే నయనతార సినిమా ప్రమోషన్ వేడుకలు అయిన ఆడియో విడుదల కార్యక్రమం.. ప్రీ రిలీజ్ వేడుక వంటి కార్యక్రమాలకు హాజరు కాదు అనేది విమర్శ. రజినీకాంత్.. చిరంజీవి.. విజయ్ ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ ను కూడా ఎగ్గొట్టిన నయనతార తన పెళ్లి వేడుకకు కూడా ఆసక్తి చూపడం లేదట.
తమిళ మీడియాలో గత రెండు మూడు రోజులుగా నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం గురించి వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగబోతుందని ఆ వార్తల సారాంశం. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. దాంతో పుకార్లన్నింటికి చెక్ పెట్టేందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. స్టార్స్ లవ్ మ్యారేజ్ అంటే అదిరిపోయే రేంజ్ లో ఏర్పాట్లు ఉంటాయి. కాని నయనతార మాత్రం వేడుక ఇష్టం లేదని సింపుల్ గా తన పెళ్లి కానిచ్చేయాలని భావిస్తుందట.
సినిమాల ఆడియో వేడుకలకు హాజరు అయ్యేందుకు ఇబ్బంది పడ్డట్లుగానే అందరి ముందు పెళ్లి చేసుకునేందుకు నయన్ ఇబ్బంది పడుతుందా అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. కారణం ఏమో కాని హిందూ సాంప్రదాయం ప్రకారం మొదట ఒక గుడిలో నయన్ వివాహం జరుగబోతుంది. ఆ తర్వాత చర్చిలో అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. నయన్ పెళ్లి వేడుక కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా పెద్ద నిరాశే అని చెప్పక తప్పదు.