నయనతార కెరీర్ ఆరంభం అయ్యి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తుంది. కెరీర్ ఆరంభం అయిన కొన్నాళ్లకే నయనతార పెళ్లి గురించిన వార్తలు రావడం మొదలు అయ్యింది. అప్పటి నుండి నిన్న మొన్నటి వరకు నయనతార పెళ్లి గురించి కొన్ని వేల సార్లు మీడియా లో ఏదో ఒక విధంగా వార్తలు వచ్చాయి. నయనతార పెళ్లి జూన్ 9 అంటూ కొన్ని వారాల నుండి వార్తలు వస్తున్నాయి.
ఇన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజం అవ్వక పోవడంతో జూన్ 9 న పెళ్లి వార్తలు కూడా ఫేక్ అయ్యి ఉంటాయి అంటూ చాలా మంది భావించారు. నేడు పెళ్లి అయ్యే వరకు కూడా చాలా మంది వారిద్దరి పెళ్లి అవుతుందంటే నమ్మలేకున్నాం.. అయ్యే వరకు నమ్మం అంటూ వచ్చారు. ఎట్టకేలకు నయన్ విఘ్నేష్ ల పెళ్లి మహాబలిపురంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.
నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నారు. నయనతార క్రిస్టియన్ అయినప్పటికి గతంలోనే హిందుత్వాన్ని తీసుకుంది. దాంతో వీరి వివాహం ను హిందూ సాంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. మొదట వీరి వివాహం ను తిరుపతి లో అనుకున్నారు. కాని బంధుమిత్రులు అక్కడకు రావడం చాలా కష్టం అనే ఉద్దేశ్యంతో మహాబలిపురం లోనే ఫిక్స్ చేయడం జరిగింది.
హీరోయిన్ గా ఇప్పటికి కూడా మంచి ఫామ్ లో ఉన్న నయనతార పెళ్లి చేసుకోవడంను కొందరు ఆమె అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో నేడు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతోంది. అభిమానులు నయన్ మరియు విఘ్నేష్ ల యొక్క జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సంసార జీవితం సంతోషంగా సాగాలంటూ కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హీరోయిన్ గా కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా ఎక్కువ గా మీడియాలో నిలిచిన నయనతార ఇప్పుడు తన పెళ్లి తో వార్తల్లో నిలిచింది. ప్రముఖులు మరియు కుటుంబ పెద్దల సమక్షంలో నయనతార మెడలో తమిళ హిందూ సాంప్రదాయం ప్రకారం విఘ్నేష్ శిన్ మూడు ముళ్లు వేశాడు.
నూతన దంపతులకు తమిళ సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా తరపున మీ తరపున కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నాం.