ఓరి నయనో.. మళ్ళీ బ్రేకప్‌

Update: 2016-04-04 11:30 GMT
ఇప్పటికే మూడు నాలుగు బ్రేకప్స్‌ కారణంగా బాకా చితికిపోయింది అనుకున్న హీరోయిన్‌ నయనతార.. ఇప్పుడు ప్రేమలో హ్యాపీగా ఉందని అభిమానులు అనుకుంటుంటే.. ఇప్పుడు మరోసారి బ్రేకప్‌ న్యూస్‌ వినిపిస్తోంది.

''నానుం రౌడీ దాన్‌'' (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా షూటింగ్ సమయంలో.. ఆ సినిమా డైరక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో పడింది నయన. ఇద్దరూ హగ్‌ చేస్తున్న సెల్ఫీ ఒకటి తన వాట్సాప్‌ డిస్‌ ప్లే పిక్చర్‌ గా పెట్టడంతో అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. అయితే నయన్‌ మాత్రం ఎప్పుడూ ఈ విషయం గురించి పెద్దగా చెప్పకపోయినా కూడా.. కోలీవుడ్‌ అంతటా విషయం దావనంలా పాకేసిందంతే. కాని ఇప్పుడు మాత్రం.. ఈ హ్యాపీ కపుల్ మధ్యలో బ్రేకప్‌ సెగలు పుట్టేశాయి అంటున్నారు.

పెళ్ళి చేసుకుందాం అని విఘ్నేష్‌ అంటుంటే.. ఇప్పుడే సడన్‌ గా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి కాబట్టి.. ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకుందాం అని నయన్‌ చెప్పిందట. దానితో ఇద్దరి మధ్యనా గొడవలు వచ్చేశాయి అంటున్నారు. ఓరి నాయనో కాదు.. ఓరి నయనో అనాల్సిందే ఎవరైనా. చూద్దాం ఏం జరుగుతుందో.
Tags:    

Similar News