ఆ హీరోయిన్ పై నయనతార కౌంటర్‌

Update: 2022-12-23 04:35 GMT
లేడీ సూపర్ స్టార్‌ నయనతార చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన కనెక్ట్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నయనతార మీడియా ముందుకు వచ్చి పలు విషయాలను షేర్‌ చేసుకుంది.

తన సుదీర్ఘమైన సినీ కెరీర్‌ లో ఇప్పటి వరకు నయనతార సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. శ్రీరామ రాజ్యం సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్‌ లో పాల్గొంది. తన పై గత కొన్నాళ్లుగా వస్తున్న విమర్శలకు మరియు తన గురించి ఇతరులు అనుకుంటున్న మాటలకు తాజా ఇంటర్వ్యూల్లో నయన్ క్లారిటీ ఇచ్చింది.

కొన్నాళ్ల క్రితం హీరోయిన్‌ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలకు నయనతార సున్నితంగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం నయన్‌ మరియు మాళవిక మోహన్‌ మధ్య జరిగిన సంభాషణలు మరియు ఇతర చర్చల గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ నయనతార పేరు ఎత్తకుండా... ఒక సూపర్ స్టార్‌ హీరోయిన్‌ యాక్సిడెంట్‌ అయ్యి చావుబతుకుల్లో ఉన్న సన్నివేశం లో కూడా మేకప్ వేసుకుని కనిపించింది. అలాంటి సీన్లలో కూడా ఐ లైనర్.. మేకప్‌ తో ఎలా నటిస్తారో అర్థం కాలేదు అంటూ నయనతార పై ఇండైరెక్ట్‌ గా మాళవిక మోహనన్ కామెంట్స్ చేసింది.

మాళవిక మోహనన్ వ్యాఖ్యలపై నయనతార స్పందించింది. నయన్ మాట్లాడుతూ.. ఆ హీరోయిన్ ఇంటర్వ్యూ చూశాను. ఆమె నా పేరు ఎత్తలేదు కానీ ఆమె అన్నది నా గురించే అని నాకు అర్థం అయ్యింది. ఆమె చెప్పినట్లుగానే నేను ఆ సన్నివేశంలో మేకప్‌ తోనే నటించాను. అయితే పాత్ర మరియు సినిమా డిమాండ్‌ మేరకు నేను మినిమం మేకప్‌ లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఆ సన్నివేశం డిమాండ్ మేరకే యాక్సిడెంట్‌ సన్నివేశంలో కూడా తాను అలా కనిపించాల్సి వచ్చింది. ఆ సన్నివేశం కోసం నేను కాస్త జుట్టు చెరుపుకుంటేనే దర్శకుడు అలా అక్కర్లేదు అన్నాడు. అప్పుడు మనం ఏం చేయగలం అన్నట్లుగా నయనతార చెప్పుకొచ్చింది.

దర్శకులు చెప్పినట్లుగా తాను నటిస్తాను. దర్శకులు కమర్షియల్‌ సినిమాల కోసం ఎలా నటించాలి అంటే అలా నటించాను అన్నట్లుగా నయనతార చెప్పుకొచ్చింది. నయన్‌ రెస్పాన్స్ కు మాళవిక రియాక్షన్‌ ఏంటీ అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News