నయనతార మర్డర్ల వలనే అలా జరిగింది

Update: 2017-03-23 10:54 GMT
సీనియర్ భామ నయనతార మెయిన్ లీడ్లో రూపొందిన సినిమా ''డోరా''. ఈ సినిమాను మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. అవ్వడానికి హారర్ సినిమా కావడంతో.. ఇప్పుడు సినిమాకు టాక్ బాగా వస్తే తెలుగులో కూడా దున్నుకునే ఛాన్సుంటుంది. అయితే ఈ సినిమాలో విషయంలో సెన్సార్ బోర్డు మాత్రం ఒక పంచ్ ఇచ్చేసింది అంతే.

ఈ మధ్య కాలంలో మనోళ్ళు హారర్ లకు క్రైమ్ థ్రిల్లర్ లకు కూడా 'యు' సర్టిఫికేట్ వస్తుందని అంచనాలు వేస్తున్నారులే. దానికి తగ్గట్లే హింసాత్మక సీన్లు తక్కువగా ఉంటే బోర్డు కూడా యు చేతిలో పెట్టేస్తోంది. అయితే డోరా విషయంలో మాత్రం నయనతార ఈ సినిమాలో చేసిన మర్డర్ల తాలూకు డోస్ ఎక్కువగా ఉండటంతో.. 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చేశారు. కనీసం యు/ఎ వచ్చినా కూడా ట్యాక్సులో కాస్త రిబేటు వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. అందుకే సినిమాలోని ఆ సీన్లలో వయలెన్స్ పాళ్ళు తగ్గించి.. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారు.

అయినా దెయ్యాల సినిమాలు తీసిన.. వాటికి 'U' సర్టిఫికేట్ డిమాండ్ చేయడం ఏంటండీ? అసలు హారర్ జోనర్ సినిమా అనగానే డిఫాల్టుగా మనోళ్ళకు 'A' సర్టిఫికేట్ చేతిలో పెట్టేయడం పెట్టేయడమే కరక్టు. ఏమంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News