ఫోటో స్టొరీ: సూర్యుడిని ముద్దాడుతున్న నయన్

Update: 2019-06-16 05:39 GMT
సౌత్ లో శ్రీదేవి.. విజయశాంతి తర్వాత ఆ రేంజ్ లో లేడీ సూపర్ స్టార్ బిరుదు సాధించిన హీరోయిన్ నయనతార మాత్రమే.  ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉంటారు కానీ వారికి నయన్ కు ఉండే ఇమేజ్ లేదు. జస్ట్ నయన్ పేరు మీదే బిజినెస్ జరగడం.. నయన్ పోస్టర్ చూసి ప్రేక్షకులు థియేటర్ కు రావడం అనేది సాధారణ విషయం కాదు. నయన్ ఎప్పుడూ మూడు నాలుగు సినిమాల్లో నటిస్తూ ఊపిరి సలపకుండా ఉంటుంది.  అయితే సమయం చిక్కినప్పుడు ఫారెన్ వెకేషన్ కు చెక్కేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.

ప్రస్తుతం అదే పనిలో ఉంది. తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ తో కలిసి యూరోప్ ట్రిప్ లో సరదాగా సమయాన్ని గడుపుతూ రీఛార్జ్ అవుతోంది.  గత కొన్ని రోజులుగా గ్రీస్ దేశంలో ఈ ప్రేమ జంట విహార యాత్ర కొనసాగుతోంది. గ్రీస్ లోని సాంటోరిని లో చిల్ అవుట్ అవుతున్న ఫోటోలు కూడా బైటకు వచ్చాయి. తాజాగా మరో అందమైన పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది.  ఈ ఫోటోలో నయనతార ఒక బాత్ టబ్ లో హాయిగా పడుకొని సుర్యాస్తమయాన్ని.. నారింజ రంగులో ఉండే లేలేత సూర్య కిరణాలను అస్వాదిస్తోంది.  ఈ ఫోటో లో స్పెషల్ ఏంటంటే సూర్యుడిని ముద్దాడుతున్నట్టుగా నయన్ లిప్స్ కు ఒక మిల్లీమీటర్ దూరంలోనే సూర్యుడు ఉండడం.  అందుకే ఈ ఫోటోకు సన్ కిస్డ్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇలాంటి కళాత్మకమైన ఫోటో ఎవరు తీయగలరు? తీస్తే ఒక సినిమాటోగ్రాఫర్.. లేకపోతే ఒక డైరెక్టర్ కు మాత్రమే సాధ్యం.  అర్థం అయిందిగా.. ఫోటోలో కన్పించేది నయన్ అయినా ఫోటో వెనక ఉన్నది నయన్ ఆత్మ విఘ్నేశ్.  

ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే మళయాళం లో 'లవ్ యాక్షన్ డ్రామా'.. తెలుగులో 'సైరా'.. తమిళంలో 'దర్బార్'.. #దళపతి63 సినిమాల్లో నటిస్తోంది.  అన్నీ క్రేజీ పాజెక్టులే.  నివిన్ పౌలి .. చిరంజీవి.. రజనీకాంత్.. విజయ్ హీరోలు.  ఇంతకంటే సూపర్ లైనప్ ఏ  హీరోయిన్ కు ఉంటుంది చెప్పండి?


Tags:    

Similar News