దెయ్యం వస్తోంది. భూతం వస్తోంది.. అంటూ చిన్న పిల్లల్ని భయపెట్టేస్తుంటాం. కానీ ఆ దెయ్యం ఎప్పటికీ రాదు, అసలు భూతం అనేది ఉందో లేదో కూడా ఎవరికీ తెలీదు. కానీ అది వెండి తెరపై కాసులు కురిపించే నయా ఫార్ములా. అందుకే ఈ ఫార్ములా వెంటపడుతున్నారంతా. ఇటీవలి కాలంలో దెయ్యం, భూతం అంటూ భయపెట్టేస్తూ హారర్ జోనర్ లో సినిమాల్ని తెరకెక్కించి హిట్లు కొడుతున్నారంతా. ఆ జోనర్‌లోనే నయనతార కూడా భయపెట్టేందుకు వస్తోంది.
ఇప్పటికే జ్యోతిక చంద్రముఖిలో, నందిత ప్రేమకథా చిత్రంలో, అంజలి గీతాంజలిలో భయపెట్టేశారు. త్వరలోనే స్వాతి త్రిపుర గా భయపెట్టబోతోంది. ఈలోగానే నయనతార కూడా మయూర పేరుతో భయపెట్టేందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆయన చంద్రకళ, పిశాచి, ఉత్తమ విలన్, జ్యోతిలక్ష్మి వంటి సినిమాల్ని తెరకెక్కించాడు. చంద్రకళ మంచి లాభాల్ని తేవడంతో దెయ్యం సినిమాల్ని నమ్ముకుని బతికేస్తున్నారాయన.
అన్నిరసాల్లోకి భయం అనే రసం డబ్బు పరంగా వర్కవుటవుతోంది. అందుకే ఎవ్వరూ వదిలిపెట్టడం లేదు. అయితే ఇలా ఎన్నిరోజులు భయపెడతారు? నిత్యం హారర్ సినిమాలే తీస్తారా? జనాలు బోర్ ఫీలవ్వరా? అయినా ఇలాంటి మూడనమ్మకాల్ని ఎందుకు ప్రచారం చేస్తారు?